Innovative Cooler Video: కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - May 27 , 2025 | 05:53 PM
ఓ వ్యక్తి తన ఇంట్లో కూలర్‌కు బదులుగా అలాంటి చల్లదనాన్ని ఇచ్చే వింత వస్తువును తయారు చేశాడు. ఇందుకోసం పక్కన పడేసిన కారు టైరు, టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాడు. చివరకు అతను చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

వినూత్నంగా ఆలోచించాలే గానీ.. పనికిరాదనుకున్న ప్రతి వస్తువూ అద్భుతంగా పనికొస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచిస్తే.. పక్కన పడేసిన వస్తువులను కూడా తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చు. ఇందుకు నిదర్శనంగా ఎంతో మంది వివిధ రకాల ప్రయోగాలు చేయడం రోజూ చూస్తున్నాం. ఇంట్లో చల్లదనం వచ్చేందుకు కొందరు వినూత్నంగా ఆలోచించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ వ్యక్తి తన ఇంట్లో కూలింగ్ వచ్చేలా సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. టైరు, టేబుల్ ఫ్యాన్‌తో అతను చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో కూలర్‌కు బదులుగా అలాంటి చల్లదనాన్ని ఇచ్చే వింత వస్తువును తయారు చేశాడు. ఇందుకోసం పక్కన పడేసిన కారు టైరు, టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాడు.
మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..
పాత టైరుకు మధ్యలో ఓ వైపు టేబుల్ ఫ్యాన్‌ను సెట్ చేయగా.. మరో వైపు కూలర్ గడ్డిని సెట్ చేశాడు. టైరు మధ్యలో నీళ్లు పోసి ఫ్యాన్ ఆన్ చేశాడు. ఫ్యాన్ గిరగిరా గిరగడం వల్ల టైరులోని నీళ్లన్నీ తుంపర్లుగా బయటికి చిమ్ముతూ గదిని మొత్తం చల్లగా మార్చేస్తున్నాయి. ఇలా పాత టైరు, టేబుల్ ఫ్యాన్‌తో (Cooler made from old tire and table fan) వింత కూలర్‌ను తయారు చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాత టైరుతో కూలర్.. ప్రయోగం మామూలుగా లేదుగా’’. అంటూ కొందరు, ‘‘టైరు ధర ఇప్పుడు మరింత పెరుగుతుందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,600కి పైగా లైక్‌లు, 6.68 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..
ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..