King Cobra Viral Video: గాఢ నిద్రలో వ్యక్తి.. పైకి ఎక్కిన కింగ్ కోబ్రా.. చివరికి ఒళ్లు జలదరించే సీన్..
ABN , Publish Date - May 27 , 2025 | 09:04 PM
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాడు. గాఢనిద్రలో ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ మంచం వైపు వస్తుంది. అంతటితో ఆగకుండా నేరుగా..

పాము అంటేనే ఒళ్లంతా భయంతో వణికిపోతుంది. ఇక కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన పాములను చూస్తే పైప్రాణాలు పైన్నే పోయేంత పనవుతుంటుంది. కింగ్ కోబ్రా ఒక్కసారి కాటేసిందంటే.. ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. దీంతో దీని జోలికి వెళ్లేందుకు మనుషులు కానీ, జంతువులు కానీ సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు ఈ కింగ్ కోబ్రా బారి నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచంపై గాఢ నిద్రలో ఉండగా.. కింగ్ కోబ్రా పాము పైకి ఎక్కేసింది. చివరకు ఎలా తప్పించుకున్నాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాడు. గాఢనిద్రలో ఉండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ (King Cobra Crawling on Bed) మంచం వైపు వస్తుంది. అంతటితో ఆగకుండా నేరుగా మంచంపైకి ఎక్కేస్తుంది. చివరికి అతడి కాళ్ల మీదుగా అటూ, ఇటూ తిరుగుతుంది.
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..
ఆ తర్వాత అతడి కాళ్లపై నుంచి దాటుకుని ఆ పక్కనే ఉన్న దుప్పట్లలో దూరుతుంది. చివరగా దుప్పటి పైనుంచి తల అతడి వైపు పెట్టి గమనిస్తుంది. చాలా సేపు అతడి వైపే చూసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత తల పైకి ఎక్కి మరీ చూస్తుంది. దీంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఆ పామును వీడియో తీస్తున్న ఆ వ్యక్తి.. ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లిపోతాడు. తర్వాత చూస్తే ఆ కింగ్ కోబ్రా అక్కడే పడగ పైకి ఎత్తి చూస్తుంటుంది. పాము తన మీదుగా వచ్చినప్పుడు.. కదలకుండా అలాగే పడుకోవడంతో పాము కాటేయకుండా వెళ్లిపోయింది.
అయ్యో.. ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టమే వచ్చిందే.. వధువును వీడియో తీస్తూ..
ఈ సమయంలో భయంతో అటూ, ఇటూ కదిలి ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇతడి టైం ఎంతో బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 68 వేలకు పైగా లైక్‌లు, 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..