Share News

Buffalo VS Lion Video: సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..

ABN , Publish Date - May 30 , 2025 | 01:30 PM

ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. అదే సమయంలో దూరంగా ఉన్న సింహాలు.. దూడను టార్గెట్ చేశాయి. గేదె దూరంగా ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్న దూడపై దాడి చేశాయి. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Buffalo VS Lion Video: సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..

పిల్లలను కంటికి రెప్పలా కాపాడడంలో తల్లి ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తల్లి ప్రేమ చూపించడంలో జంతువులు కొన్నిసర్లు మనుషులనే మరిపిస్తుంటాయి. తమ పిల్లలను కాపాడుకోవడం కోసం అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటాయి. ఈ క్రమంలో ఎలాంటి జంతువునైనా లెక్కచేయవు. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గేదె తన దూడను కాపాడుకునేందుకు సింహాలతో ఫైట్ చేసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. అదే సమయంలో దూరంగా ఉన్న సింహాలు.. దూడను టార్గెట్ చేశాయి. గేదె దూరంగా ఉన్న సమయంలో ఒంటరిగా ఉన్న దూడపై దాడి చేశాయి. దూడను కిందపడేసి చంపేసే సమయంలో తల్లి గేదె అప్రమత్తమవుతుంది.

రైలుకు వేలాడుతూ యువతి భయంకర విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..


తన పిల్లను కాపాడుకునేందుకు సింహాలతో తలపడుతుంది. చుట్టు ముట్టిన సింహాలపై (Buffalo attack on lions) ధైర్యంగా పోరాడుతుంది. దూడను చంపేయాలని ఎంత ప్రయత్నించినా.. సింహాలను కొమ్ములతో కుళ్లపొడిచి మరీ తన దూడను కాపాడుకుంటుంది. ఇలా గేదె ఒంటరిగా సింహాలపై పోరాటం చేస్తుంది. అయితే ఇంతలో దూరంగా ఉన్న గేదెల మంద అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది. అన్నీ కలిసి సింహాలను తరిమి తరిమి కొడతాయి. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది.

తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..


కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం’’.. అంటూ కొందరు, ‘‘తల్లి ప్రేమలో మనుషులనే మించిపోయిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 30 , 2025 | 01:30 PM