Jugaad Viral Video: తెలివంటే ఈమెదే.. వాటర్ బాటిల్‌ను వంద క్యాండిల్ బల్బుగా మార్చిందిగా..
ABN , Publish Date - May 23 , 2025 | 01:43 PM
పనికిరావని పక్కన పడేసే వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేసే వారిని రోజూ చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళ వాటర్ బాటిల్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. వారట్ బాటిల్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

వాడుకునే తెలివే ఉంటే.. పనికిరాదనుకున్న వస్తువు కూడా ఎంతో బాగా పని చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా ఎంతో మంది ఇళ్లల్లోని వస్తువులతో ఏవేవో ప్రయోగాలు చేయడం చూస్తున్నాం. వాడిపడేసిన పేస్ట్ డబ్బాను కుళాయి మూతగా వాడడం, పాత చెప్పులను ఫోన్ స్టాండ్‌గా మార్చడం తదితర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూశాం. తాజాగా, ఓ మహిళ వాటర్ బాటిల్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘వాటర్ బాటిల్‌ను వంద క్యాండిల్ బల్బుగా మార్చిందిగా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాటర్ బాటిల్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఇంట్లో కరెంట్ పోతే ఏం చేస్తాం. కొవ్వొత్తి వెలిగించడమో లేక ఫోన్ లైట్ ఆన్ చేయడమో చేస్తాం కదా. అదే వాటర్ బాటిల్‌తో వెలుతురు తేవచ్చని ఎవరికైనా అనిపిస్తుందాం.
ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..
వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇలాగే చేసింది. చీకటి గదిలో ఫోన్ లైట్ ఆన్ చేసిన ఆమె.. ఆ ఫోన్‌ను టేబుల్‌పై పెట్టింది. ఆ తర్వాత ఫోన్ లైటుపై వాటర్ బాటిల్‌ను పెట్టింది. దీంతో ఆ వెలుకు కాస్తా.. మరింత కాంతివంతంగా గది మొత్తం విస్తరించింది. పెద్ద లైటు వెలిగితే ఏ విధంగా వెలుతురు వస్తుందో.. అలా ఈ వాటర్ బాటిల్ పెట్టగానే అంతే స్థాయిలో వెలుతురు వచ్చింది. ఇలా ఈమె సింపుల్‌గా వాటర్ బాటిల్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వాటర్ బాటిల్‌ను కాస్తా వంద క్యాండిల్ బల్బులా మార్చిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 6.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..
ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..