Share News

Snake Viral Video: చిన్నారిపై పడగెత్తిన కోబ్రా.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - May 31 , 2025 | 01:10 PM

ఓ చిన్నారి నేలపై కూర్చుని ఆడుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ పిల్లాడి వద్దకు వస్తుంది. చిన్నారి ముట్టుకోవడంతో పాము సడన్‌గా పడగ ఎత్తుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..

Snake Viral Video: చిన్నారిపై పడగెత్తిన కోబ్రా.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

పాములతో కొందరు కావాలని కెలుకుతూ ఆటలాడుతుంటారు. పాములను పట్టుకుని కోవడానికి ప్రయత్నిస్తూ కొందరు, ఏకంగా వాటిని మెడలో వేసుకుని, నడుముకు చుట్టుకోవడం వంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు చిన్న పిల్లలు తెలిసీ తెలీక విష సర్పాలతో ఆటలాడుకుుంటుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రమాదకరమైన కింగ్ కోబ్రా చిన్నారి వద్దకు వెల్లి పడగ విప్పింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారి నేలపై కూర్చుని ఆడుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము పాక్కుంటూ పిల్లాడి వద్దకు వస్తుంది. పామును చూసిన పిల్లాడు కేరింతలు వేస్తూ దాన్ని చేతులతో (child playing with king cobra) పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో పాము ముందు పిల్లాడిని కాటేసేందుకు పడగ ఎత్తుతుంది.

స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..


అది విష సర్పం అనే విషయం తెలీని ఆ చిన్నారి.. దాన్ని చేతులతో పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. అయితే ఆ పిల్లాడు ఇంత చేస్తున్నా పాము మాత్రం అతన్ని ఏమీ అనదు. కాటేయాల్సిన పాము.. అందుకు విరుద్ధంగా కామ్‌గా ఉండిపోతుంది. మధ్యలో మధ్యలో చిన్నారి వద్దకు వెళ్లి అలాగే నిలబడుతుంది. ఇలా ఆ పిల్లాడు కింగ్ కోబ్రాతో చాలా సేపు ఆటుకుంటాడు. అయితే ఇంత జరుగుతున్నా అక్కడున్న వారు పిల్లాడిని పక్కకు తీసుకెళ్లకుండా అలాగే వేడుక చూస్తుంటారు. చూస్తుంటనే ఈ పాముకు కోరలు తీసినట్లు అనిపిస్తోంది.

తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..


అయినా చిన్నపిల్లలతో ఇలా చేయించడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిన్న పిల్లలతో ఇలా చేయించడం చాలా ప్రమాదం’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 6.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2025 | 01:23 PM