Woman Funny Video: ఇలాక్కూడా అడుక్కుంటారా.. ఈమె నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - May 30 , 2025 | 02:03 PM
కొందరు మహిళలు దుకాణాల వద్ద డబ్బులు అడుక్కుంటుంటారు. ఈ క్రమంలో ఓ దుకాణంలోకి వెళ్లిన వారు విచిత్రంగా ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. మహిళల్లో కొందరు దుకాణంలోకి వెళ్లి యజమానిని డబ్బులు అడుగుతుండగా.. వారిలో ఓ మహిళ విచిత్రంగా ప్రవర్తించింది..

తెలిసి చేస్తారో, తెలీక చేస్తారో గానీ, కొందరు చేసే పనులు.. చూడటానికి విచిత్రంగా అనిపిస్తుంటాయి. మరికొందరు చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇంకొందరు అమాయకత్వంతో చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ దుకాణం ముందు బొమ్మ దగ్గరికి వెళ్లి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు మహిళలు దుకాణాల వద్ద డబ్బులు అడుక్కుంటుంటారు. ఈ క్రమంలో ఓ దుకాణంలోకి వెళ్లిన వారు విచిత్రంగా ప్రవర్తించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. మహిళల్లో కొందరు దుకాణంలోకి వెళ్లి సదరు యజమానిని (Woman begging for money) డబ్బులు అడుగుతుండగా.. వారిలో ఓ మహిళ షాపు ముందున్న బొమ్మను చూసి మనిషి అనుకుని దగ్గరికి వెళ్లింది.
స్విమ్మింగ్ ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..
అందరిలాగానే ఈ బొమ్మను కూడా డబ్బులు ఇవ్వమంటూ చేతులు చాపుతూ అడిగింది. బొమ్మలో ఎలాంటి చలనం లేదని తెలిసి కూడా పదే పదే డబ్బులు అడుగుతూ ప్రాథేయపడుతూ ఉంది. ఇలా చాలా సేపు ఆమె అక్కడే నిలబడి ఆ బొమ్మను (Doll) డబ్బులు అడగడం చూసి అక్కడున్న వారు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డ్ అయింది.
తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భిక్షాటనలో ఈమె చాలా సిన్సియర్‌లా ఉన్నట్టుందే’’.. అంటూ కొందరు, ‘‘ఎవరినీ వదలకుండా డబ్బులు అడుగుతోందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లు, 44.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..