Crocodile Viral Video: అవేమన్నా కుక్క పిల్లలు అనుకున్నావా.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jun 03 , 2025 | 07:11 AM
చాలా మొసళ్లు నీటి ఒడ్డున గుంపులుగా చేరి ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో ఓ కవర్ పట్టుకుని అక్కడికి వస్తాడు. మొసళ్ల మధ్యన నడుచుకుంటూ వచ్చిన అతను మధ్యలో నిలబడతాడు. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

భయంకరమైన జీవులను చూసేందుకే చాలా మంది భయపడుతుంటే.. కొందరు మాత్రం వాటితో ఆడుకుంటుంటారు. మరికొందరు ఏకంగా వాటితో చిన్నపిల్లలుగా తరహాలో అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసళ్ల వద్ద చేస్తున్న నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అవేమన్నా కుక్క పిల్లలు అనుకున్నావా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మొసళ్లు నీటి ఒడ్డున గుంపులుగా చేరి ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో ఓ కవర్ పట్టుకుని అక్కడికి వస్తాడు. మొసళ్ల మధ్యన నడుచుకుంటూ వచ్చిన అతను మధ్యలో నిలబడతాడు. తర్వాత కవర్‌లో చేయి పెట్టి, మాంసం బయటికి తీసి మొసలి నోటిలో పడేస్తాడు.
వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
ఇలా అన్ని మొసళ్లను తట్టి లేపి మరీ (Man Feeding Meat To Crocodiles) మాంసాన్ని తినిపిస్తాడు. అవి కూడా అతన్ని చూడగానే.. దగ్గరికి వచ్చి తల పైకి ఎత్తి నోరు తెరుస్తాయి. చూస్తుంటే ఆ వ్యక్తి మొసళ్ల ట్రైనర్ అని తెలుస్తోంది. అయినా ఇలా చిన్న పిల్లలకు ఆహారం తినిపించిన తరహాలో.. మొసళ్లకు మాంసం తినిపించడం చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చిన్నారిపై పడగెత్తిన కోబ్రా.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇతనేంటీ ఇలా చేస్తున్నాడు’.. అంటూ కొందరు, ‘సోదరుడు..యమరాజ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు , 95 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
రోడ్డుపై స్కేటింగ్ చేయాలని చూశాడు.. చివరకు గేదె చేసిన పనికి ఖంగుతిన్నాడు..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..