Share News

Skating Viral Video: రోడ్డుపై స్కేటింగ్ చేయాలని చూశాడు.. చివరకు గేదె చేసిన పనికి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:03 PM

ఓ యువకుడు ఎక్కడ స్థలం లేనట్లు రద్దీగా ఉన్న రోడ్డుపై స్కేటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులోనూ అత్యంత వేగంగా స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Skating Viral Video: రోడ్డుపై స్కేటింగ్ చేయాలని చూశాడు.. చివరకు గేదె చేసిన పనికి ఖంగుతిన్నాడు..

కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకోవాలని చూస్తంటారు. మరికొందరు నెట్టింట ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రోడ్డుపై వేగంగా స్కేటింగ్ చేయాలని ప్రయత్నించాడు. చివరకు గేదె చేసిన పనికి ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఎక్కడ స్థలం లేనట్లు రద్దీగా ఉన్న రోడ్డుపై స్కేటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులోనూ అత్యంత వేగంగా (young man skating fast on the road) స్కేటింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

చిన్నారిపై పడగెత్తిన కోబ్రా.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..


రోడ్డుపై ఎదురుగా గేదెలు వచ్చినా ఆ యువకుడు అలాగే స్కేటింగ్ చేస్తూ వెళ్లాడు. గేదెలను తప్పించి ముందుకు దూసుకెళ్లాలని ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఓ గేదెను తగులుకుని (young man fell after being hit by buffalo) గాల్లోకి లేచి ధబేల్‌మని కిందపడ్డాడు. అయితే ఈ ఘటనలో అతడికి పెద్ద గాయాలేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను వెనుక వస్తున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలాక్కూడా అడుక్కుంటారా.. ఈమె నిర్వాకం చూస్తే.. నోరెళ్లబెడతారు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రోడ్డుపై ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’.. అంటూ కొందరు, ‘ఏదే చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదే అయ్యింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లు, 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2025 | 01:05 PM