Share News

Pakistan Viral Video: పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:00 AM

ఓ వ్యక్తి తన ఇంటి మేడ పైకి ఎక్కి మొత్తం వీడియో తీశాడు. వీడియో తీయడంలో విశేషం ఏమీ లేకున్నా.. ఆ వీడియోలో కనిపించిన దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇది పాకిస్తాన్ కాదు.. ట్యాంకిస్తాన్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Pakistan Viral Video: పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కొన్ని నెలలుగా పాకిస్తాన్‌కు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఎంతో మంది ఫన్నీ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇది ఇది పాకిస్తాన్ కాదు.. ట్యాంకిస్తాన్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి మేడ పైకి ఎక్కి మొత్తం వీడియో తీస్తాడు. వీడియో తీయడంలో విశేషం ఏమీ లేకున్నా.. ఆ వీడియోలో కనిపించిన దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు. తన చుట్టూ అనేక ఇళ్ల కనిపిస్తుంటాయి.

ఇదికదా టాలెంట్ అంటే.. ఇతడి పనితనం చూస్తే శభాష్ అని మీరే అంటారు..


అయితే అన్ని ఇళ్లపై రెండు, మూడు, నాలుగు.. (Water Tanks on Houses) ఇలా చాలా నీళ్ల ట్యాంకులు కనిపిస్తుంటాయి. ఎక్కువ భాగం తెల్లటి రంగులో ఉన్న ట్యాంకులే దర్శనమిస్తుంటాయి. ఇళ్లను చూడగానే మొదట ట్యాంకులే కనిపిస్తుంటాయి. ఇలా ప్రతి ఇంటిపై నాలుగు, ఐదు ట్యాంకులు కనిపించడం, మొత్తం ఊరు ఊరంతా ఇలా ట్యాంకులతో నింపేయడం చూపరులకు వింతగా అనిపిస్తుందన్నమాట.

ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమంటే ఇదే.. ప్యాంటుకు నిప్పు పెట్టి మరీ..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాకిస్తాన్.. కాదిది ట్యాంకిస్తాన్’.. అంటూ కొందరు, ‘ప్రధాని మోదీ నీళ్లు నిలిపేయడంతో ఈ పరిస్థితి వచ్చినట్లుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 7.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..


ఇవి కూడా చదవండి..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 09:00 AM