Begging via YouTube: అడుక్కోవడంలో కొత్త ట్రెండ్.. యూట్యూబ్‌ను ఎలా వాడుకుంటున్నారో చూస్తే..
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:13 PM
కొందరు యువతీయువకులు యూట్యూబ్ ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి పని చేయకుండా ముందు క్యూఆర్ కోడ్‌ను పెట్టుకుని కింద కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి..

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా ఎంతో మంది పేరుతో పాటూ లక్షల ఆదాయం గడించడం చూస్తున్నాం. కొందరు వినూత్న ప్రయోగాలు చేస్తూ, మరికొందరు వింత వింత సాహసాలు చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. ఇంకొందరు ఎలాంటి కష్టం లేకుండా సూచనలు, సలహాలు ఇస్తూ కూడా ఆదాయాన్ని గడిస్తుంటారు. అయితే ఇటీవల కొందరు యూట్యూబ్ ద్వారా అడుక్కుంటున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
కొందరు యువతీయువకులు యూట్యూబ్ (YouTube) ద్వారా అడుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి పని చేయకుండా ముందు క్యూఆర్ కోడ్‌ను పెట్టుకుని కింద కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి అర్ధనగ్నంగా కింద కూర్చుని బ్రష్ చేస్తున్నాడు. అలాగే తన ఎదురుగా క్యూఆర్ కోడ్‌ను (QR code) స్కానర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి పనులూ చేయకుండా, కనీసం పాటలు కూడా పాడకుండానే అతను డబ్బులు అడుక్కుంటున్నాడు. ఆశ్చర్యకరంగా ఇతడికి కూడ చాలా మంది స్కాన్ చేసి మరీ డబ్బులు పంపిస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వెనుకున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
గుడిలో మెట్లపై కూర్చుని అడుక్కున్న (Begging) చందంగా.. ఈ యువకుడు ఇలా రోజంతా ఇలా ఫోన్ స్క్రీన్ ముందు క్యూఆర్ కోడ్ పెట్టుకుని కూర్చొన్నాడు. తన గది అద్దెకు రూ.50లు చెల్లించాలని అందరినీ అడుక్కుంటున్నారు. ఇలా ఆ వ్యక్తి రోజుకు యూపీఐ ద్వారా రూ.5000 నుంచి రూ.10,000 వరూ సంపాదిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఓ 50 ఏళ్ల వ్యక్తి యూపీఎస్సీ ప్రిపరేషన్ పేరుతో విరాళాలు సేకరిస్తున్నాడు. ఇంకొందరు పేర్లను మెహందీతో రాస్తామంటూ, మరికొందరు స్కెచ్ పెన్‌లతో రాస్తామని చెబుతూ డబ్బులు అడుక్కుంటున్నారు.
రెండు ఖండాలు, 14 దేశాలు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే ఎక్కడుందో తెలుసా..
ఇలా ఎంతో మంది ఎలాంటి కష్టం లేకుండా ఏవేవో కారణాలు చెబుతూ సబ్‌స్కైబర్ల నుంచి డబ్బులు అడుక్కోవడం సర్వసాధారణమైంది. కాగా, క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్న వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం దారుణం’.. అంటూ కొందరు, ‘ఇతడికి డబ్బులు పంపిస్తున్న వారు ఎంత మూర్ఖులో అర్థమవుతోంది’.. అం్టూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
పడుకోవాలని వెళ్లాడు.. తల దిండు కింద చూసి ఖంగుతిన్నాడు..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..