Share News

Viral Accident Video: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వెనుకున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:04 PM

ముగ్గురు యువకులు బైకుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోడ్ల కూడలిలోకి రాగానే ఎదురుగా మినీ వ్యాన్ వస్తుంటుంది. ఈ క్రమంలో బైకు కాలువలోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన యువకుడిని చూసి అంతా షాక్ అవుతున్నారు..

Viral Accident Video: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. వెనుకున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..

ప్రమాదాలు చెప్పి రావు.. అది వచ్చిందంటే.. తర్వాత దాని గురించి మనం చెప్పుకోవాలి. అనూహ్య ప్రమాదాలు సంభవించే సమయంలో తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. మరికొందరు అంతా ఆశ్చర్యపోయేలా ప్రమాదాలను నుంచి ఊహించని రీతిలో బయటపడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైకులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లారు. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి తప్పించుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు యువకులు బైకుపై వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగు రోడ్ల కూడలిలోకి రాగానే ఎదురుగా మినీ వ్యాన్ వస్తుంటుంది. సడన్‌గా వ్యాన్ ఎదురుగా రావడంతో దాన్ని తప్పించబోయిన యువకులు.. నేరుగా కాలువలోకి దూసుకెళ్లిపోతారు.

కొండపై మహిళ విచిత్ర నిర్వాకం.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అయితే ఈ సమయంలో వారిలో వెనుక కూర్చున్న వ్యక్తి సెకన్ల వ్యవధిలో అప్రమత్తమవుతాడు. బైకు కాలువలోకి దూసుకెళ్లే క్రమంలో దాని పైనుంచి కిందకు దూకేస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువపై ఉన్న రెయిలింగ్ వాల్‌ను పట్టుకుంటాడు. మిగతా ఇద్దరూ (Youths fell into canal along with bike) నేరుగా కాలువలోకి దూసుకెళ్లిపోయారు.

అవేమన్నా కుక్క పిల్లలు అనుకున్నావా.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి..


ఈ ఘటనలో వారిద్దరి పరిస్థితి ఏమైందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అదృష్టమంటే ఇతడిదే’.. అంటూ కొందరు, ‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, 62 వేలకు పైగా లైక్‌లు, 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పడుకోవాలని వెళ్లాడు.. తల దిండు కింద చూసి ఖంగుతిన్నాడు..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2025 | 12:04 PM