Longest Highway in The World: రెండు ఖండాలు, 14 దేశాలు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే ఎక్కడుందో తెలుసా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:52 AM
ఒకటి కదా, రెండు కాదు ఏకంగా 14 దేశాలు, రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవేగా రికార్డుల్లోకి ఎక్కింది. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ రహదారికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జిల్లాలను కలుపుతూ నిర్మించే హైవేలను చూస్తుంటాం.. రాష్ట్రాలను కలుపుతూ నిర్మించే రహదారులను కూడా చూస్తుంటాం. అయితే ఏకంగా దేశాలను కలుపుతూ నిర్మించే రహదారులను ఎప్పుడైనా చూశారా.. అది కూడా రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన హైవే ఉందంటే మీరు నమ్ముతారా. కానీ ఇది అక్షరాలా నిజం. రెండు ఖండాలు, 14 దేశాలను కలుపుతూ నిర్మించిన ఈ హైవే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డుల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే..
పాన్-అమెరికన్ హైవేగా (Pan-American Highway) పిలిచే ఈ రోడ్డు.. ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాతో కలుపుతూ (North America to South America) ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా రికార్డు సృష్టించింది. ఈ హైవే ఉత్తర అమెరికా అలాస్కాలోని ప్రుధో బే వద్ద ప్రారంభమై..కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హొండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, బొలీవియా దేశాల మీదుగా ప్రయాణించి అర్జెంటీనాలోని ఉషుయా నగరంలో ముగుస్తుంది. 30,600 కిలోమీటర్లు (19,000 మైళ్లు) పొడవైన ఈ పాన్-అమెరికన్ హైవే మొత్తం 14 దేశాలను కలుపుతూ వెళ్తుంది.
ఒక్క యూటర్న్ కూడా లేకుండా..
ఈ పాన్-అమెరికన్ హైవేలో రోజుకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా కూడా.. దీన్ని పూర్తిచేయాలంటే సుమారు రెండు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అలాగే ఈ మార్గాన్ని ఒక్క యూటర్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిర్మించారు.
అందమైన అనుభూతి అందిస్తూ..
ఈ రహదారిలో వెళ్తుంటే కేవలం ప్రయాణ అనుభూతులే కాకుండా భిన్న సంస్కృతులు, వివిధ దేశాలకు సంబంధించిన సాంప్రదాయాలను పరిచయం చేస్తుందన్నమాట. అలాగే ఎడారులు, కొన్నిసార్లు ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్ర తీరాలు.. ఇలా అనేక అందమైన దృశ్యాలు కట్టిపడేస్తాయి. అదేవిధంగా అనేక రకాల జంతువులను కూడా చూడొచ్చన్నమాట.
ఇలాంటి ఇబ్బందులూ ఉండొచ్చు..
ఈ రోడ్డుపై ప్రయాణం మొత్తం ఎంతో జాలీగా ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిచోట్ల ఎత్తైన కొండలు, ఇంకొన్ని ప్రాంతాల్లో అడవులు కనిపిస్తాయి. అలాగే వందల కిలోమీటర్ల వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ఆండీస్ పర్వతాల్లో ప్రయాణించే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రహదారి ఉద్దేశమిదే..
అమెరికాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ హైవే ప్రధాన ఉద్దేశం. ఈ రహదారిని 1889లో మొదట ప్రతిపాదించగా.. 1920ల ప్రారంభంలో ప్రారంభమైంది. అలాగే ఈ రహదారి నిర్మాణం, నిర్వహణకు సంబంధించి 14 దేశాలు 1937లో పరస్పర ఒప్పందానికి వచ్చాయి. ఫైనల్‌గా 1960లో ఈ రహదారిపై సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించారు. ఈ రహదారిపై పెద్ద పెద్ద మలుపులు లేకున్నా.. పనామా - కొలంబియా మధ్య 160కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే ‘డేరియన్ గ్యాప్’ అని పిలుస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..