Jugad Viral Video: ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..
ABN , Publish Date - Jun 06 , 2025 | 08:39 AM
ఓ వ్యక్తి టాయిలెట్ కమోడ్‌ను వాడిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంట్లో వంట గది లేదో.. లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చేశాడో తెలీదు గానీ.. ఓ విచిత్రమైన పని చేశాడు. ఇతడి ప్రయోగం చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

ఇళ్లల్లోని వస్తువులను చిత్రవిచిత్రంగా వినియోగించం సర్వసాధారణమైంది. కొందరు పక్కన పడేసిన వస్తువులను తిరిగి అద్భుతంగా పనికొచ్చేలా చేస్తుంటారు. మరికొందరు వాటిని వాడే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టాయిలెట్ కమోడ్‌ను వాడిన విధనం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. కమోడ్ తయారైంది ఇందుకా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి టాయిలెట్ కమోడ్‌ను (Toilet commode) వాడిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంట్లో వంట గది లేదో.. లేక సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చేశాడో తెలీదు గానీ.. ఓ విచిత్రమైన పని చేశాడు.
నిరుపయోగంగా ఉన్న టాయిలెట్ కమోడ్‌ను చూడగానే అతడికి ఓ వింత ఆలోచన వచ్చింది. దాన్ని పొయ్యిలా ఎందుకు వాడకూడదు.. అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ కమోడ్‌ను తీసుకుని, దానిపై వంట పాత్రను పెట్టాడు. ఆ తర్వాత కమోడ్ మధ్యలో కట్టెలు పెట్టి మంట పెట్టాడు. ఇలా కమోడ్‌ను పొయ్యిలా వాడి (Cooking on the toilet commode) వంట చేసేశాడన్నమాట. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా జరుగుతుందని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను.. ఇప్పుడు చూస్తూ ఉన్నాను’.. అంటూ కొందరు, ‘ఎక్కడ ఏ పని చేయకూడదో అదే చేశారుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..