Share News

Snake Bite Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. రక్షిస్తున్న సమయంలో సడన్‌‌గా ఏమైందంటే..

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:53 PM

ఓ నాగుపాము ప్రమాదవశాత్తు చేపల వలలో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను పామును రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Snake Bite Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. రక్షిస్తున్న సమయంలో సడన్‌‌గా ఏమైందంటే..

పాములతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొందరు పాములతో ప్రమాదకర ఆటలు ఆడుతూ చివరకు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. మరికొందరు విష సర్పాలతో కూడా ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వలలో ఇరుక్కుపోయిన నాగుపామును కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జౌన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము ప్రమాదవశాత్తు చేపల వలలో ఇరుక్కుపోయింది. అది గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను పామును రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఎంతో జాగ్రత్తగా వలను కత్తిరించి పామును బయటికి తీసేందుకు ప్రయత్నించాడు.


అయితే ఈ క్రమంలో పాము ఒక్కసారిగా (Snake bites snake catcher) అతడి చేతిపై కాటేసింది. ఈ ఘటనతో అతడితో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మురళీ వాలే అనే ఇతను ఓ యూట్యూబర్. పాములు పట్టడంలో ఇతనికి ఎంతో అనుభవం ఉంది. ఇప్పటి వరకూ ఇతను సుమారు 8 వేల వరకు పాములు పట్టుకుని, సురక్షిత ప్రాంతాల్లో వదిలాడు. ఆ వీడియోలను తన ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర వేదికల్లో షేర్ చేస్తుంటాడు. ఇతడికి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


పాములు పట్టడంలో అపార అనుభవం ఉన్న ఇతను.. గతంలో చాలా సార్లు పాము కాటుకు గురై కోలుకున్నాడు. తాజాగా, నాగుపాము అతడిని కాటేసిన ఘటన స్థానికులందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాములు పట్టుడంలో ఎంత అనుభవం ఉన్నా కూడా ఇలాంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి’.. అంటూ కొందరు, ‘ఇతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 159 లక్షలకు పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 04 , 2025 | 05:06 PM