Watch Video: ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమంటే ఇదే.. ప్యాంటుకు నిప్పు పెట్టి మరీ..
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:18 AM
ఓ యువకుడు చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇటీవల చాలా మంది సిగరెట్‌ను సినిమా స్టైల్లో వెలిగించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యువకుడు వారందరికీ భిన్నంగా సిగరెట్‌ను సరికొత్తగా వెలిగించాలని అనుకున్నాడు. అయితే చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

కొందరు అనూహ్య రీతిలో ప్రమాదాల్లో చిక్కుకుంటుంటే.. మరికొందరు వాటిని కోరి కోరి కొనితెచ్చుకుంటుంటారు. అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. చాలా మంది తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నిప్పుతో చెలగాటమాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇటీవల చాలా మంది సిగరెట్‌ను సినిమా స్టైల్లో వెలిగించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యువకుడు వారందరికీ భిన్నంగా సిగరెట్‌ను సరికొత్తగా వెలిగించాలని అనుకున్నాడు. కుర్చీలో కూర్చున్న అతను అగ్గిపుల్ల వెలిగించాడు. దాంతో సిగరెట్ వెలిగించుకుంటాడని అంతా అనుకుంటే, అందుకు విరుద్ధంగా ప్యాంట్‌ను వెలిగిస్తాడు.
బ్రెయిన్ వాడడమంటే ఇదే.. టీని ఎలా వడకట్టేస్తున్నాడంటే..
అగ్గిపుల్లతో ప్యాంట్‌పై మంట పెట్టడంతో కాసేపటికి పెద్ద మంటగా మారిపోయింది. మంట పెద్దగా మారిన తర్వాత.. సిగరెట్‌ను నోటిలో పెట్టుకుని ముందుకు వంగి మరీ వెలిగించుకున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిగరెట్‌ను వెలిగించుకున్న తర్వాత మంటను ఆర్పేయాలని చూడగా సాధ్యం కాదు. ఎంత ప్రయత్నించినా మంట ఇంకా పెద్దగా మారుతుందే తప్ప ఆరిపోవడం లేదు. దీంతో భయపడ్డ అతను.. కుర్చీలో నుంచి పైకి లేచి మరీ మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు.
పాములతో జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. రక్షిస్తున్న సమయంలో సడన్‌గా ఏమైందంటే..
అప్పటికీ సాధ్యం కాకపోవడంతో అక్కడే ఉన్న వారు కూడా మంటను ఆర్పేందుకు ప్రయత్నిస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం స్టంట్‌రా నాయనా.. అంటూ కొందరు, కోరి కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమంటే ఇదే.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 7 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..
ఇవి కూడా చదవండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..
కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..