Stunts Viral Video: ఇదికదా టాలెంట్ అంటే.. ఇతడి పనితనం చూస్తే శభాష్ అని మీరే అంటారు..
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:01 PM
ఓ వ్యక్తి మూటలు మోసే పనిలో ఉంటాడు. బరువైన మూటలను భుజంపై వేసుకుని మరో చోటుకు తరలిస్తుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. అతను పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. అలుపు సొలుపేమున్నది’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఆడుకుంటూ పాడుకుంటూ పని చేస్తే అసలట అనేదే అనిపించదు. దీన్ని నిజం చేస్తూ ఎంతో మంది కష్టమైన పనులను సైతం ఎంతో సులభంగా చేసేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి వినూత్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బరువైన మూటలను ఎంతో సులభంగా మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వావ్.. ఇది కదా పనితనం అంటే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మూటలు మోసే పనిలో ఉంటాడు. బరువైన మూటలను (Man Carrying Heavy Bags) భుజంపై వేసుకుని మరో చోటుకు తరలిస్తుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. అతను పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
బ్రెయిన్ వాడడమంటే ఇదే.. టీని ఎలా వడకట్టేస్తున్నాడంటే..
మూటను భుజంపై వేసుకున్న అతను.. పైనుంచి కిందకు దిగే క్రమంలో మెట్లకు ఇరువైపులా ఉన్న రెయిలింగ్‌పై చేతులు పెట్టి.. రయ్యిన దూసుకుంటూ కిందకు వచ్చాడు. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో ముందుకు వెళ్లి ఆ మూటను మరో ప్రాంతలో వేశాడు. ఇలా అంత బరువైన మూటలను సైతం ఇలా ఆడుతూ, పాడుతూ మోసుకెళ్తున్నాడన్నమాట. ఇతడి పనితనం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమంటే ఇదే.. ప్యాంటుకు నిప్పు పెట్టి మరీ..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇది కదా టాలెంట్ అంటే’.. అంటూ కొందరు, ‘పనితనం అంటే ఇలా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..
ఇవి కూడా చదవండి..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..
ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..