Jugaad Viral Video: ఇతడి తెలివి అమోఘం.. పాత డబ్బాను చివరకు ఎలా మార్చాడో చూడండి..
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:00 PM
కొందరు పాత వస్తువులపై ఏవేవో ప్రయోగాలు చేసి వాటిని సరికొత్తగా మార్చుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

కాదేదీ కవితకు అనర్హం.. అన్న నానుడిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తద్వారా కాదేదీ.. ప్రయోగానికి అనర్హం.. అని నిరూపిస్తున్నారు. ఎందుకూ పనికిరావనుకున్న వస్తువులను తిరిగి వినియోగంలోకి తేవడంతో పాటూ అంతకు ముందు కంటే ఎక్కువ ప్రయోజనాలు అందించేలా తయారు చేస్తుంటారు. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, గ్యాస్ స్టవ్.. ఇలా దేన్నీ వదలకుండా వినూత్న ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పాత డబ్బాను తయారు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇతడి తెలివి అమోఘం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పాత ఇనుప డబ్బాతో (Old iron can) విచిత్ర ప్రయోగం చేశాడు. డబ్బాకు నాలుగు వైపులా రేకులు తొలగించాడు. ఓ వైపు ఫ్యాన్ ఏర్పాటు చేయగా.. మిగతా మూడు వైపులా కూలర్‌కు వాడే గడ్డిని ఏర్పాటు చేశాడు. డబ్బా మధ్యలో నీళ్ల పైపు ఏర్పాటు చేశాడు.
డబ్బాకు ముందు వైపు ఉన్న స్విచ్‌ను లాగడం ద్వారా నీళ్లు పైకి, కిందకు దూకేలా సెట్ చేశాడు. ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత.. ఆన్ చేయగా.. ఫ్యాన్ గిర్రున తిరుగుతూ ఇల్లు మొత్త కూలింగ్ అయిందన్నమాట. ఇలా పనికిరాదనుకున్న ఇనుప డబ్బాను కాస్తా.. (Converting an old iron can into cooler) మినీ కూలర్‌గా మార్చేశాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇతడి ముందు ఇంజినీర్ కూడా పనికిరాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్ను ఎలా వాడుతున్నారో చూడండి..