Share News

Bride And Groom Funny Video: తెగ నవ్వుకున్న వధువు.. ఈ వరుడికి పెద్ద కష్టమే వచ్చిందిగా..

ABN , Publish Date - Jun 08 , 2025 | 11:53 AM

ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. పూల దండలతో వేదికపై నిలబడ్డ వరుడికి బంధువులు ఓ పరీక్ష పెట్టారు. అయితే ఫైనల్‌గా వరుడు చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

Bride And Groom Funny Video: తెగ నవ్వుకున్న వధువు.. ఈ వరుడికి పెద్ద కష్టమే వచ్చిందిగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పెళ్లి అంటేనే అందులో ఏదో ఒక విచిత్ర సంఘటన జరుగుతుందని అంతా ఎదురు చూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే వారి వారి వివాహాల్లో ఏదో ఒక విచిత్ర సంఘటన ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. మొత్తం మీద ఇలాంటి వీడియోలన్నీ కలిసి నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రపోజ్ చేయమని వరుడికి చేతికి పువ్వు అందిస్తే.. చివరకు అతను చేసిన నిర్వాకం.. వధువుతో పాటూ అక్కడున్న వారందరినీ తెగ నవ్వించింది. ఈ వీడియో చూసిన వారంతా.. మరీ అమాయకుడిలా ఉన్నాడే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరుల (Bride and groom) మధ్య తమాషా సంఘటన చోటు చేసుకుంది. పూల దండలతో వేదికపై నిలబడ్డ వరుడికి బంధువులు ఓ పరీక్ష పెట్టారు. చేతికి ఓ పువ్వు అందించి, వధువుకు మోకాలిపై నిలబడి ప్రపోజ్ చేయమని సూచించారు.


పువ్వును చేతిలోకి తీసుకున్న వరుడు వారు (Groom Proposed to Bride) చెప్పినట్లుగానే ప్రపోజ్ చేశాడు. అయితే అతడు ప్రపోజ్ చేసిన విధానం చూసి వధువుతో పాటూ అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేయాల్సిన వరుడు.. అందుకు విరుద్ధంగా రెండు మోకాళ్లు వంచి చేస్తాడు. దీంతో పక్కన ఉన్న వారు నవ్వుకుని, అలా కాదు ఇలా చేయ్.. అని వాళ్లు చేసి చూపిస్తారు. అయినా వరుడు మోకాలిపై కాకుండా చిత్రవిచిత్రంగా ప్రపోజ్ చేస్తాడు.


ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆ వరుడు మాత్రం.. ‘నా తీరు మారదు’.. అన్నట్లుగా విచిత్రంగా ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వరుడు మరీ అమాయకుడిలా ఉన్నాడే’.. అంటూ కొందరు, ‘ఈ వరుడికి ఎంతో స్వచ్ఛమైన మనసు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 46 వేలకు పైగా లైక్‌‌లు, 2.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 11:53 AM