Share News

Lion Attack Viral Video: సింహం షాకింగ్ వేట.. పందిని ఎలా పట్టుకుందంటే..

ABN , Publish Date - Jun 08 , 2025 | 10:43 AM

ఆకలితో ఉన్న ఓ సింహం.. వేటకు వెళ్లింది. వేట కోసం అటూ, ఇటూ చూసిన దానికి ఓ బొరియలో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకేముందీ.. వెంటనే ఆ బొరియ వద్దకు వెళ్లి కాసేపు గమనిస్తుంది. ఆ తర్వాత అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

Lion Attack Viral Video: సింహం షాకింగ్ వేట.. పందిని ఎలా పట్టుకుందంటే..

సింహం.. పేరుకు తగ్గట్టుగా అది చేసే ప్రతి పనిలోనూ రాజసం కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు సింహాల వేట చూస్తే అంతా షాక్ అయ్యేలా ఉంటుంది. రెప్పపాటు కాలంలోనే ఎంత పెద్ద జంతువునైనా ఇట్టే మరి కరిపిస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహం పందిని వేటాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతుంది. ఆకలితో ఉన్న ఓ సింహం.. వేటకు వెళ్లింది. వేట కోసం అటూ, ఇటూ చూసిన దానికి ఓ బొరియలో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకేముందీ.. వెంటనే ఆ బొరియ వద్దకు వెళ్లి కాసేపు గమనిస్తుంది.


ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెల్లగా దాని సమీపానికి వెళ్లి, పంజాతో విరుకుపడుతుంది. చూస్తుండగానే అతి కష్టం మీద లోపలి నుంచి ఓ పెద్ద పందిని (lion dragged pig out of hole) బయటికి లాక్కొచ్చింది. సింహం బారి నుంచి తప్పించుకోవాలని పంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. పందిని పట్టుకున్న సింహం.. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి తినేస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకుల సమక్షంలో జరుగుతుంది.


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అందుకే అడవికి రాజు అయింది’.. అంటూ కొందరు, ‘సింహం వేట అంటే ఇలాగే ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10వేలకు పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2025 | 01:26 PM