Marriage Funny Video: వరుడి స్నేహితులు ఇలా చేశారేంటీ.. వారి గిఫ్ట్ చూసిన వధువు సిగ్గుతో..
ABN , Publish Date - Jun 08 , 2025 | 08:57 AM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై ఉండగా.. అతిథులుంతా వారికి బహుమతులు అందిస్తూ ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో వరుడి స్నేహితులు వింత బహుమతిని తీసుకుని వస్తారు. దాన్ని చూసి వధువు తెగ సిగ్గుపడిపోతుంది. ఈ వీడియో చూసిన వారంతా.. అరే.. వధువును ఇలా చేశారేంట్రా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు జంటలను కలపడమే కాకుండా.. జనాలకు వినోదాన్ని పంచే వేదికలుగా కూడా మారుతున్నాయి. ఏ వివాహ కార్యక్రమంలో చూసినా ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు సినిమా కామెడీకి మంచిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడు స్నేహితులు తెచ్చిన గిఫ్ట్ చూసి వధువు సిగ్గుతో తల దించుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు (Bride and groom) వేదికపై ఉండగా.. అతిథులుంతా వారికి బహుమతులు అందిస్తూ ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. వరుడి స్నేహితులంతా కలిసి ఓ వినూత్నమైన బహుమతితో వేదికపైకి వెళ్లారు.
అయితే ఆ గిఫ్ట్‌ను (gift) చూడగానే వధువు సిగ్గుతో తల పక్కకు తిప్పుకొంటుంది. వధువు చేతిలో పిల్లల పాల సీసా పెట్టిన అతిథులు.. వరుడి చేతిలో పిల్లలు ఆడుకునే గిలకను పెట్టారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న పోస్టర్‌ను వారి చేతులతో ఆవిష్కరిస్తారు. ఆ పోస్టర్‌పై ‘కొంచెం ఆగండి.. మేము కూడా 9 నెలల్లో వస్తున్నాం’.. అని రాసి ఉంటుంది. ఇలా వరుడి స్నేహితులంతా విచిత్రమైన బహుమతితో అక్కడున్న వారందరినీ తెగ నవ్వించేశారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి గిఫ్ట్ కూడా ఉంటుందా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 42 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..