Share News

Swimming Viral video: సరదా కోసమా.. చావు కోసమా.. ఎలా ఈత కొడుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Jun 08 , 2025 | 07:39 AM

ఓ వ్యక్తి నీళ్లలో ఈత కొడుతుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా ఈత కొట్టే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Swimming Viral video: సరదా కోసమా.. చావు కోసమా.. ఎలా ఈత కొడుతున్నాడో చూడండి..

ఈత కొట్టడమంటే చాలా మందికి సరదా. అయితే కొందరు తెలిసీ తెలీక ఎక్కడ పడితే అక్కడ ఈత కొడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు ఈత కొట్టే సమయంలో వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రమాదాల్లో పడుతుంటారు. అయితే ఇకొందరు మాత్రం ప్రాణం పోతుందని తెలిసినా ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. సరదా కోసమా లేక చావడానికా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నీళ్లలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా కూడా ఈత కొట్టే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఈత వచ్చే వారు పైనుంచి దూకడంతో పాటూ వివిధ రకాలుగా ఈత కొడుతుంటారు. అలాగే ఈత రాని వారు నడుముకు ప్లాస్టిక్ క్యాన్లు కట్టుకోవడం, లేదా ట్యూబ్‌లు చుట్టుకుని ఈత కొడుతుంటారు.


అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఏకంగా జేసీబీ (Man Swimming With Help of JCB) బకెట్‌కు తాడు కట్టి, దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. తర్వాత జేసీబీ ఆపరేటర్ బకెట్‌ను అటూ, ఇటూ తిప్పుతుండగా.. ఆ వ్యక్తి కూడా నీళ్ల మీదుగా జారుకుంటూ వెళ్తున్నారు. ఇలా అటూ, ఇటూ వేగంగా ఈత కొడుతూ ఉన్నాడు. బకెట్ తిప్పే సమయంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.


అయినా అతను ఏమాత్రం భయపడకుండా ఈత కొట్టడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా ఈత కొట్టడం ప్రమాదం’.. అంటూ కొందరు, ‘మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదేనేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 08:12 AM