Couples Viral Video: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకుంది.. చివరకు చిన్న ట్రిక్‌తో ఎలా తప్పించుకున్నాడంటే..
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:12 PM
భర్త వేరే యువతితో ఏకాంతంగా గడుపుతున్నాడని భార్యకు సమచారం అందింది. దీంతో డైరెక్ట్‌గా వెళ్లి తన భర్తను పట్టుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు తన భర్త ఉన్న ఇంటి వద్దకు వెళ్లింది. అయితే ఆ భర్త తన భార్య నుంచి తప్పించుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

భార్యాభర్తలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. భర్తకు తెలీకుండా భార్య.. భార్యకు తెలీకుండా భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఒకరికి మరొకరు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడుతుంటారు. ఇలాంటి వీడియోలు కూడా తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వెళ్లిన భార్యకు వింత అనుభవం ఎదురైంది. భర్త తప్పించుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భర్త వేరే యువతితో ఏకాంతంగా గడుపుతున్నాడని భార్యకు సమచారం అందింది. దీంతో డైరెక్ట్‌గా వెళ్లి తన భర్తను పట్టుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు తన భర్త ఉన్న ఇంటి వద్దకు వెళ్లింది. బయట నిలబడి తలుపు కొట్టింది. కాసేపటికి తలుపు తీసిన భర్త.. బయట తన భార్యను చూసి షాక్ అయ్యాడు.
అయితే ఆ వెంటనే తన భార్యను గట్టిగా (Husband hugging his wife) కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకుని ఆమెను బయటికి లాక్కొచ్చాడు. గదిలోకి చూడకుండా ఆమె తలను పట్టుకుని, ముఖంపై ముద్దులు పెట్టసాగాడు. ఇంతలో తన ప్రియురాలికి సైగ చేయగా.. ఆమె సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంది. ఆ తర్వాత తన భార్యను అలా కౌగిలించుకుంటూనే ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇలా తెలివిగా వ్యవహరించి తన భార్యకు అనుమానం రాకుండా మ్యానేజ్ చేసేశాడన్నమాట.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ భర్త తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లు, 33 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..