Zebra VS Crocodiles: మొసళ్ల మధ్యలో జీబ్రా.. చంపేసే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:31 PM
ఓ జీబ్రా నది నీటిని దాటుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం వేచి ఉన్న మొసళ్లు.. జీబ్రా రాగానే చుట్టుముడతాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అవుతుంది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికి చంపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియలో మొసళ్ల వేట వీడియోలు అనేకం వైరల్ అవుతుంటాయి. మొసళ్లు ఒక్కసారి వేటను టార్గెట్ చేస్తే ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. చిన్న చిన్న జంతువులు కూడా మొసళ్ల బారి నుంచి సులభంగా తప్పించుకుని వెళ్తుంటాయి. మరికొన్ని ఏకంగా మొసళ్లతో యుద్ధం చేసి మరీ ప్రాణాలతో బయటపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొసళ్లకు చిక్కిన జీబ్రా.. బయటపడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటజన్లు.. మొసళ్లకు షాక్ ఇచ్చిన జీబ్రా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జీబ్రా నది నీటిని దాటుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే వేట కోసం వేచి ఉన్న మొసళ్లు.. జీబ్రా రాగానే చుట్టుముడతాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అవుతుంది. వాటిలో ఓ మొసలి (Crocodiles tried to attack zebra) జీబ్రాను కొరికి చంపే ప్రయత్నం చేస్తుంది.
అయితే ఇంతలో జీబ్రా దాని పై దవడను పట్టుకుని గట్టిగా కొరికేస్తుంది. దెబ్బకు ఆ మొసలికి చుక్కలు కనిపిస్తాయి. ఆ మొసలిని కొరికేయడంతో మిగతా మొసళ్లు భయంతో సైలెంట్ అయిపోతాయి. ఆ తర్వాత జీబ్రా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కొంత దూరం వెళ్లాక మరో మొసలి దాన్ని వేటాడేందుకు ప్రయత్నిస్తుంది. అయితే జీబ్రా దాన్ని కూడా విజయవంతంగా (Zebra escapes from crocodiles) దాటుకుని గట్టు పైకి చేరుకుంటుంది. ఇలా మొసళ్ల గుంపును సైతం ధైర్యంగా ఎదిరించి, తన ప్రాణాలను దక్కించుకుంటుంది.
ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మొసళ్లకు చుక్కలు చూపించిన జీబ్రా.. అంటూ కొందరు, జీబ్రాను తక్కువ అంచనా వేస్తే ఇలాగే జరుగుతుంది.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.41 లక్షలకు పైగా లైక్‌లు, 15 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..