Funny Viral Video: దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:11 AM
ఓ యువకుడు పండ్ల దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో అటూ, ఇటూ తిరిగిన తర్వాత ముందుగా కొన్ని మామిడి పండ్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పరుగందుకున్నాడు. దీంతో దుకాణ యజమాని అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు విచిత్ర విన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకోవాలని చూస్తుంటే.. మరికొందరు ఫన్నీ ప్రాంక్ వీడియోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పండ్ల దుకాణ యజమానితో ఫన్నీ గేమ్ ఆడాడు. ఆ తర్వాత అతన్ని ఏమార్చి ఆ యువకుడు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ చోరీ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు పండ్ల దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో అటూ, ఇటూ తిరిగిన తర్వాత ముందుగా కొన్ని మామిడి పండ్లను తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పరుగందుకున్నాడు. దీంతో దుకాణ యజమాని అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.
అయితే కాస్త దూరం పరుగెత్తిన అతను.. దుకాణం చివరన ఆగి, అక్కడున్న పుచ్చకాయలను తీసుకునేందుకు పరిశీలిస్తాడు. దీంతో అతను దొంగ కాదు అని ఆ దుకాణ యజమాని అక్కడే ఆగిపోతాడు. ‘అయ్యో.. అనవరసరంగా ఈ యువకుడిని దొంగ అని అనుమానించానే’.. అని అనుకుంటూ దుకాణంలోకి నడుస్తూ వెళ్తాడు. అయితే ఇంతలో ఆ యువకుడు అక్కడున్న పుచ్చకాయలు (Man stole the fruit) కూడా ఎత్తుకుని పారిపోతాడు. చివరకు వెనక్కు తిరిగి చూడగా.. ఆ యువకుడు పారిపోవడం కనిస్తుంది. దీంతో షాక్ అయిన అతను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఆ యువకుడు అదృశ్యమై ఉంటాడన్నమాట.
ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లు అనిపిస్తు్న్నా కూడా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాట్ ఏ ఫన్నీ చోరీ..’.. అంటూ కొందరు, ‘ఇది ఊహించని దొంగతనం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100కి పైగా లైక్‌లు, 2.75 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..