Train Robbery Video: రైల్లో ఇలా వీడియో తీస్తే మీ ఫోన్ గల్లంతే.. ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:18 AM
ఓ వ్యక్తి రైల్లో దొంగలు ఫోన్లను ఎలా ఎత్తుకెళ్తారో చూపించేందుకు సిద్ధమవుతాడు. రైల్లో ముంబైకి వెళ్తున్న అతను.. మధ్యలో సొరంగంలో ఫోన్ బయటికి పెట్టి వీడియో తీస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో ఈ దొంగ టాలెంట్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

కదులుతున్న రైళ్లలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు తలుపు వద్ద నిల్చుని ప్రమాదరకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఇంకొందరు ఫోన్‌తో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని దొంగలు క్యాష్ చేసుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కదులుతున్న రైల్లో చేయి బయటికి పెట్టి వీడియో తీస్తుండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అతడి ఫోన్‌ను దొంగ ఎలా కొట్టేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై (Mumbai) పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్లో దొంగలు ఫోన్లను ఎలా ఎత్తుకెళ్తారో చూపించేందుకు ఓ వ్యక్తి సిద్ధమవుతాడు. రైల్లో ముంబైకి వెళ్తున్న అతను.. మధ్యలో సొరంగంలో (Man taking video on train) ఫోన్ బయటికి పెట్టి వీడియో తీస్తుంటాడు.
ఇలా వీడియో తీస్తూ వెళ్తుండగా.. మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ దొంగ సొరంగం మధ్యలో నిలబడి ఉంటాడు. రైల్లో వీడియో తీస్తున్న వ్యక్తి సమీపానికి రాగానే.. అతడి చేతిలోని కర్రతో (Thief Stole Phone) ఆ ఫోన్‌ను గట్టిగా కొడతాడు. దీంతో ఫోన్ ఒక్కసారిగా జారి కిందపడిపోతుంది. ఈ మొత్తం ఘటనను మరో ఫోన్లో చిత్రీకరిస్తుంటారు. దొంగ ఎక్కడ నిలబడ్డాడు, ఫోన్‌ను ఎలా కొట్టేస్తున్నాడు... ఇలా సంఘటనను మొత్తం ఓ వ్యక్తి ముందు నుంచీ వివరిస్తుంటాడు. ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల విలువైన వస్తువులను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఈ వీడియో ద్వారా చూపించారన్నమాట.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చోరీలు ఇలాక్కూడా జరుగుతాయని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘రైలు ప్రయాణ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6000కి పైగా లైక్‌లు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్ను ఎలా వాడుతున్నారో చూడండి..