Share News

Innovative Bike Video: ఈ నంబర్లను నోట్ చేసుకోవాలంటే.. మినిమం నాలెడ్జ్ ఉండాల్సిందే..

ABN , Publish Date - Jun 14 , 2025 | 09:05 AM

సాధారణంగా చాలా మంది తమ బైకు నంబర్ ప్లేట్లను విచిత్రంగా సెట్ చేయడం చూస్తుంటాం. కొందరు దానిపై ఏవోవే పేర్లు రాస్తుంటే.. మరికొందరు నంబర్లు కనిపించకుండా అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Innovative Bike Video: ఈ నంబర్లను నోట్ చేసుకోవాలంటే..  మినిమం నాలెడ్జ్ ఉండాల్సిందే..

కొందరు యువకులు బైకులపై విచిత్ర ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు తమ వాహనాలను చిత్రవిచిత్రమైన రూపాల్లోకి మార్చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో చాలా మంది ఎలాగైనా అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో తమ వాహనాల్లో వినూత్న మార్పులు చేస్తుంటారు. బైకును ఆటో తరహాలో మార్చడం, బస్సు గేరును బైక్‌కు అమర్చడం వంటి వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బైకు నంబర్ ప్లేటు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. పోలీసులకు పెద్ద పరీక్షే పెట్టాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది తమ బైకు నంబర్ ప్లేట్లను (Bike number plate) విచిత్రంగా సెట్ చేయడం చూస్తుంటాం. కొందరు దానిపై ఏవోవే పేర్లు రాస్తుంటే.. మరికొందరు నంబర్లు కనిపించకుండా అతి తెలివి ప్రదర్శిస్తుంటారు.


ఇప్పుడు చూడబోయే వీడియోలో ఓ వ్యక్తి తన బైకు నంబర్ ప్లేటును పోలీసులు సైతం అవాక్కయ్యేలా సెట్ చేశాడు. ప్లేటుపై నంబర్ల స్థానంలో ఆ నంబర్‌ను తెలియజేసేలా గడియారం (clock) ముల్లులను ఏర్పాటు చేశాడు. ఆ బైక్ నంబర్ 9335 కాగా.. ఆ నంబర్ల స్థానంలో గడియారం ముల్లులును సెట్ చేశాడు. దీనివల్ల ఆ నంబర్ ఏంటో తెలుసుకోవాలంటే కొద్ది సేపు ఆలోచించాలి.


ఈ విచిత్రమైన నంబర్ ప్లేటును అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ బైకర్ తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పోలీసులను తికమక పెట్టాడుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా లైక్‌లు, 5.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుంది.


ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2025 | 09:05 AM