Share News

Tigers Viral Video: పులుల మందతో ఫుట్‌బాల్ ఆడుకున్న కొంగ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:46 PM

నీటి కొలను గట్టుపై కొన్ని పులులు సేదతీరుతుండగా.. ఓ కొంగ మెల్లగా నడుచుకుంటూ పులులకు ఎదురుగా వచ్చి నిలబడింది. పులులను చూసి భయంతో పారిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా వాటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tigers Viral Video: పులుల మందతో ఫుట్‌బాల్ ఆడుకున్న కొంగ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

పులులు ఎంత ప్రమాదకరమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఏ జంతువూ వాటి జోలికి వెళ్లే సాహసం చేయదు. ఒకవేళ ఎదురుపడినా పారిపోయి వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. చిన్న చిన్న జంతువులు కూడా పులులకు ఎదురెళ్లి పోరాడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను తరచూ చూస్తుంటాం. తాజాగా, ఓ కొంగ పులులతో పులులతో పోరాడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటి కొలను గట్టుపై కొన్ని పులులు సేదతీరుతుండగా.. ఓ కొంగ మెల్లగా నడుచుకుంటూ పులులకు ఎదురుగా వచ్చి నిలబడింది. పులులను చూసి భయంతో పారిపోతుందనుకుంటే.. అందుకు విరుద్ధంగా వాటి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో పులులు కూడా అటూ, ఇటూ తిరుగుతూ దాన్ని ముందుగా హెచ్చరిస్తాయి.


వాటిలో ఓ పులి కొంగను కాలితో పక్కకు తోసి.. ‘ప్రాణాలతో ఉండాలంటే.. ఇక్కడి నుంచి వెళ్లిపో’’.. అన్నట్లుగా హెచ్చరిస్తుంది. అయినా ఆ కొంగ ఏమాత్రం భయపడకుండా పులుల సమీపానికి వెళ్తుంది. వెళ్లడమే కాకుండా పులులపై (stork attacked the tigers) దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. గాల్లోకి ఎగిరి పులులను ముక్కుతో పొడవాలని చూస్తుంది. కొంగ ఇలా చేయడంతో పులులకు తిక్క రేగి దాన్ని చంపేందుకు చుట్టుముడతాయి. ఈ క్రమంలో అన్నీ కలిసి ఒకేసారి కొంగపై దాడి చేస్తాయి. అయినా కొంగ వాటితో పోరాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.


అయితే చివరకు పులులన్నీ కలిసి (Tigers killed stork) కొంగను చంపేస్తాయి. ఇలా పులలతో ఫైట్ చేయాలని చూసి, చివరకు ఈ కొంగ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈ కొంగ ధైర్యం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘అయ్యో.. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 3.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 13 , 2025 | 06:54 PM