Tiger And Lion: పులి సమీపానికి వెళ్లిన సింహం.. చివరికి ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Jun 15 , 2025 | 10:24 AM
నీటిలో మునిగిన పులి.. వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోఓ సింహం పరుగు పరుగున దాని వెనుకగా వస్తుంది. చప్పుడు వినగానే పులి కూడా వెనక్కు తిరిగి చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

పులులు, సింహాలు అంటేనే.. మెరుపు వేగంతో వెళ్లి దారుణంగా వేటాడే సంఘటనలే గుర్తుకొస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఇవి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. మనుషుల తరహాలోనే స్నేహంగా మెలగడం, ఒకదానిపై మరొకటి ప్రేమ చూపించడం వంటి పనులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం సడన్‌గా పులికి ఎదురుపడింది. రెండింటి మధ్య యుద్ధం జరుగుతుందనుకుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటిలో మునిగిన పులి.. వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోఓ సింహం పరుగు పరుగున దాని వెనుకగా వస్తుంది. చప్పుడు వినగానే పులి కూడా వెనక్కు తిరిగి చూస్తుంది. సింహం దగ్గరికి రావడాన్ని గమనించిన పులి.. నీటి ఒడ్డుకు వెళ్తుంది.
రెండూ ఎదురెదురుగా నిలబడతాయి. దీంతో ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుందని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ రెండూ ఒకదానిపై మరొకటి ప్రేమ కురిపించుకుంటాయి. ముఖాలపై ముద్దులు పెట్టుకుంటూ (Tiger And Lion Acted Affectionately) ఆప్యాయంగా పలకరించుకుంటాయి. ఇలా పోట్లాడతాయని అనుకున్న పులి, సింహం.. అందుకు విరుద్ధంగా ప్రేమ కురిపించుకున్నాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పులి, సింహం ప్రేమ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పోట్లాడుకుంటాయనుకుంటే.. తెగ ప్రేమించుకుంటున్నాయిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 56 వేలకు పైగా లైక్‌లు, 4.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..