Share News

Lion Viral Video: ఈ సింహానికి మరీ బద్ధకమనుకుంటా.. దుకాణంలో ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - Jun 17 , 2025 | 07:17 PM

అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి చొరబడ్డ సింహం.. నేరుగా ఓ సూపర్ మార్కెట్‌లోకి చొరబడింది. సింహం లోపలికి రావడం చూసి జనం మొత్తం భయంతో పరుగులు తీశారు. అయితే లోపలికి చొరబడిన సింహం.. చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Lion Viral Video: ఈ సింహానికి మరీ బద్ధకమనుకుంటా.. దుకాణంలో ఏం చేసిందో చూస్తే..

సింహం.. అంటేనే వీరత్వానికి ప్రతీక. ఒక్కసారి జూలు విదిలించి వేటకు దిగితే ఎదురుగా ఎలాంటి జంతువున్నా సరే.. దానికి ఆహారమైపోవాల్సిందే. అందుకే అంతా సింహాన్ని అడవికి రాజు అని పిలుస్తుంటారు. అయితే ఇలాంటి సింహాలు కూడా కొన్నిసార్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం దుకాణంలోకి దూరి మరీ అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే లోపల అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) ఓ సూపర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి చొరబడ్డ సింహం.. నేరుగా (Lion enters supermarket) ఓ సూపర్ మార్కెట్‌లోకి చొరబడింది. సింహం లోపలికి రావడం చూసి జనం మొత్తం భయంతో పరుగులు తీశారు.


అయితే లోపలికి చొరబడిన సింహం.. ఎవరినీ ఏమీ అనకుండా నేరుగా మాంసం స్టోర్ వద్దకు వెళ్లింది. ప్యాక్ చేసిన మాంసాన్ని కిందకు తోసేసి మరీ లాగించేసింది. తన ఆకలి తీరే వరకూ అక్కడున్న పెద్ద పెద్ద మాంసం (Lion eats packaged meat) ముక్కలను ఎంచక్కా నమిలి మింగేసింది. ఇలా వేటాడకుండానే ఇలా సులభంగా మాంసాన్ని తిని తన కడుపు నింపేసుకుంది.


ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇక ఈ సింహం.. వేటాడటం మానేస్తుందేమో’.. అంటూ కొందరు, ‘చూస్తుంటే ఇది ఏఐ వీడియోలాగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2025 | 07:17 PM