Snake VS Eagle: పాము ప్రాణాలు తీస్తున్న డేగ.. చివరి నిముషంలో సీన్ రివర్స్.. చివరకు ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:44 PM
ఆకాశంలో విహరిస్తున్న డేగకు నేలపై పాము కనిపించింది. ఇంకేముందీ.. వెంటనే ఆఘమేఘాల మీద వచ్చి పాముపై మెరుపు దాడి చేసింది. పాము తలపై కాళ్లతో తొక్కిపెట్టింది. పాము ప్రాణాల పోతాయనుకున్న సమయంలో సీన్ రివర్స్ అయింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

గద్దలు, డేగలు, రాబందుల వేట ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్నా కూడా నేల మీద చిన్న చిన్న జీవులను కూడా ఇట్టే టార్గెట్ చేస్తాయి. ఆ వెంటనే మెరుపు వేగంతో దాడి చేసి ఎత్తుకెళ్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటికి కూడా గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. దాడి చేయాలని చూసి చివరకు తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. డేగ పాము తలపై కాలు పెట్టి తొక్కేసి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. అయితే చివరి నిముషంలో సీన్ రివర్స్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకాశంలో విహరిస్తున్న డేగకు నేలపై పాము కనిపించింది. ఇంకేముందీ.. వెంటనే ఆఘమేఘాల మీద వచ్చి పాముపై (Eagle attacking snake) మెరుపు దాడి చేసింది. పాము తలపై కాళ్లతో తొక్కిపెట్టి, పదే పదే ముక్కుతో పొడుస్తూ ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. డేగ నుంచి తప్పించుకోవడానికి పాము పలు విధాలుగా ప్రయత్నించింది.
అయినా దాని వల్ల సాధ్యం కాలేదు. తీరా ప్రాణాలు పోయే సమయంలో.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన ప్రాణాలు ఎలాగూ పోతాయని ఫిక్స్ అయిన పాము.. వెళ్తూ వెళ్తూ డేగ ప్రాణాలు కూడా తీసేయాలని ఫిక్స్ అయింది. తోకతో డేగ మెడను చుట్టేసింది. ఆ వెంటనే దాన్ని మెడను మరింత గట్టిగా చుట్టేసి ( Snake Wrapped Around The Eagle) ఊపిరాడకుండా చేసింది. దీంతో డేగ కిందకు ఒరిగిపోయి విలవిల్లాడిపోయింది. ఇలా ఆ రెండూ చాలా సేపు ఇలా ఒకదానిపై మరొకటి కక్ష తీర్చుకుంటాయి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘పగతీర్చుకున్న పాము’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లు, 29 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..