Metro Viral Video: దొంగలూ.. చోరీ చేసే ముందు ఆలోచించండి.. లేదంటే మీకూ ఇలాంటి గతే పట్టొచ్చు..
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:18 PM
మెట్రో రైల్లో ఓ యువకుడు ప్రయాణికుల ఫోన్లను టార్గెట్ చేశాడు. అందరినీ గమనించి.. చివరకు ఓ వ్యక్తి ఫోన్‌పై కన్నేశాడు. అతడి పక్కనే నిలబడి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఫోన్‌ను ఇలా కొట్టేయగానే.. అలా అతను అలెర్ట్ అయిపోయాడు. వెంటనే..

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఒంటి మీదున్న వస్తువులను కూడా మాయం చేసే రోజులివి. మన పక్కనే ఉంటూ మనకు తెలీకుండానే మన విలువైన వస్తువులను కాజేస్తుంటారు. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే ఉండదు అనే చెప్పాలి. కొన్నిసార్లు బాధితులు అప్రమత్తమై దొంగలకు చుక్కలు చూపిస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో ఓ దొంగ ఫోన్‌ను చోరీ చేయాలని ప్రయత్నించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో (Metro Train) ఓ యువకుడు ప్రయాణికుల ఫోన్లను టార్గెట్ చేశాడు. అందరినీ గమనించి.. చివరకు ఓ వ్యక్తి ఫోన్‌పై కన్నేశాడు. అతడి పక్కనే నిలబడి ఫోన్ కొట్టేసేందుకు (Thief trying to steal phone) ప్రయత్నించాడు. అయితే ఫోన్‌ను ఇలా కొట్టేయగానే.. అలా అతను అలెర్ట్ అయిపోయాడు. వెంటనే వెనక్కు తిరిగి చూసుకుంటే ఫోన్ కిందపడిపోయింది.
అయితే తన ఫోన్ తీసింది వెనుకున్న దొంగే అని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయంపై అతన్ని ప్రశ్నించగా.. తాను చోరీ చేయలేదంటూ ఆ దొంగ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే చుట్టూ ఉన్న వారంతా అతను చోరీ చేయడం చూడడంతో తప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఆ వెంటనే ఆ యువకుడు దొంగను చెప్పు తీసుకుని చితకబాదాడు. అంతలో చుట్టూ ఉన్న వారు కూడా గుంపులుగా చేరి కొట్టడం స్టార్ట్ చేశారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఇదంతా గమనించి, వారి నుంచి దొంగను కాపాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దొంగకు తగిన శాస్తి జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..