Share News

Train Accident Video: దొంగకు షాకింగ్ అనుభవం.. రైల్లో మహిళ చైన్ లాగేయడంతో..

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:50 PM

ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కనే నిలబడి ఉంటాడు. అదే సమయంలో చాలా మంది మహిళలు బాత్‌రూంలోకి వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాత్‌రూం నుంచి బయటికి రాగానే..

Train Accident Video:  దొంగకు షాకింగ్ అనుభవం.. రైల్లో మహిళ చైన్ లాగేయడంతో..

రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రధానంగా ప్రయాణికుల ఫోన్లు, మెడలో చైన్లు లాక్కెళ్లిపోయే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా దొంగలు తెలివిగా చోరీలు చేసేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్లో డోరు పక్కనే నిలబడి ఉంటాడు. అదే సమయంలో చాలా మంది మహిళలు బాత్‌రూంలోకి వెళ్లి వస్తుంటారు. అక్కడ నిలబడిన ఆ వ్యక్తి వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ బాత్‌రూం నుంచి బయటికి రాగానే (Thief pulls gold chain around woman's neck) ఆమె మెడలోని చైన్‌ను లాక్కుంటాడు.


దొంగ చైన్ లాక్కోవడంతో షాకైన మహిళ.. చైన్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఆ యువకుడు బలంగా లాగడంతో చైన్ ఊడొస్తుంది. ఆ తర్వాత అతను రైలు నుంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ క్రమంలో అతను అదుపు తప్పి (Thief fell from the train) ధబేల్‌మని బోర్లాపడిపోతాడు. ఇలా చోరీ చేయాలని చూసి, చివరకు తన ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదేనేమో’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 2.12 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 08:50 PM