Share News

Camel Ride Video: తప్పతాగి ఒంటెనెక్కాడు.... చివరకు జరిగింది చూస్తే అవాక్కవుతారు..

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:32 PM

ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి ఒంటెపైకి ఎక్కేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒంటెను గుర్రం తరహాలో సవారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో నేరుగా ఎక్స్‌ప్రెస్‌వే పైకి వచ్చేశాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Camel Ride Video: తప్పతాగి ఒంటెనెక్కాడు.... చివరకు జరిగింది చూస్తే అవాక్కవుతారు..

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అనేక మంది మందుబాబులు పట్టుబడడం చూస్తుంటాం. చాలా మంది ఫుల్‌గా మందుకొట్టి వాహనాలను నడుపుతుంటారు. తద్వారా వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ ఒంటె వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి ఒంటెపైకి ఎక్కేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి (Drunk man riding camel) ఒంటెపైకి ఎక్కేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. ఒంటెను గుర్రం తరహాలో సవారీ చేస్తున్నాడు. ఈ క్రమంలో నేరుగా పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పైకి వచ్చేశాడు. అయితే కాసేపటికి అతడికి మత్తు ఎక్కువై తూలిపడాసాగాడు.


ఒంటె తలకు కట్టిన తాడును పట్టుకున్న అతను.. మధ్య మధ్యలో ముందుకు పడసాగాడు. కొద్ది సేపటి తర్వాత పూర్తిగా ముందుకు వంగిపోయి.. ఒంటె మెడపై తూలిసపోయాడు. అయితే కారులో వెళ్తున్న వారు అతడిని ఫాలో చేసి, వాహనంలో నుంచే నీళ్లు చల్లారు. అయినా అతడు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. కాసేపు ఉంటే కిందపడిపోతాడనగా.. కారులో ఉన్న వారు కిందకు దిగి.. ఒంటెను ఆపేశారు. చివరకు దాన్ని ఓ స్తంభానికి కట్టేసి, మందుబాబును కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మందుబాబు ప్రాణాలను కాపాడి మంచి పని చేశారు’.. అంటూ కొందరు, ‘వాహనం లేకుండా డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన మందుబాబు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30 వేలకు పైగా లైక్‌లు, 9.86 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 05:32 PM