Funny Viral Video: ఇదెక్కడి ప్రాంక్‌రా నాయనా.. కాయిన్‌ను కాల్చి మరీ..
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:44 PM
ఓ వ్యక్తి తన జేబులోని రూపాయి కాయిన్ తీసుకుని వంట గదిలోని స్టవ్ వద్దకు వెళ్లాడు. స్టవ్ వెలిగించిన తర్వాత కాయిన్‌ను మంటపై చాలా సేపు ఉంచి వేడి చేస్తాడు. దాంతో చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలోచాలా మంది వివిధ రకాల వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిచండం చూస్తున్నాం. కొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే ఇంకొందరు బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి ప్రాంక్‌లు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కాయిన్‌తో చేసిన ప్రాంక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇదెక్కడి ప్రాంక్‌రా నాయనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన జేబులోని రూపాయి కాయిన్ తీసుకుని వంట గదిలోని స్టవ్ వద్దకు వెళ్లాడు. స్టవ్ వెలిగించిన తర్వాత కాయిన్‌ను మంటపై (Man heated coin on stove) చాలా సేపు ఉంచి వేడి చేస్తాడు.
బాగా వేడెక్కిన ఆ కాయిన్‌ను బయటికి (Man dropped hot coin on road) తీసుకెళ్లి, రోడ్డుపై పడేస్తాడు. అక్కడే కూర్చున్న వ్యక్తి రోడ్డుపై కాయిన్ పడిపోవడం చూసి సంతోషంతో తీసుకోవడానికి వెళ్లాడు. తీరా కాయిన్ పట్టుకోగానే చేయి కాలిపోతుంది. దెబ్బకు అతను చేయి విదిలిచుంటూ షాక్ అవుతాడు. ఇలా కాయిన్‌ను కాల్చి విచిత్రమైన ప్రాంక్ చేశాడన్నమాట. చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లు అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదెక్కడి ప్రాంక్‌రా నాయనా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లు, 3.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..