Food Viral Video: మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:42 PM
సాధారణంగా ఎవరైనా ఆమ్లెట్ చేయాంటే.. ఏం చేస్తారు.. గుడ్డును పగులగొట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తదితరాలను కలిపి కాస్త నూనె వేసి వేడి చేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. పెద్ద ఇనుప పెనం ఎదురుగా నిలబడ్డ ఆ వ్యక్తి..

ఆహార అలవాట్లు, వంట చేసే పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. చపాతీ చేస్తూ దానిపై ఉమ్మి వేసే వారు కొందరైతే.. మరికొందరు మురుగు నీటితో పానీపూరీ వంటి ఫుడ్ తయారు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి విచిత్ర వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పాకిస్తానీ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతను ఆమ్లెట్ చేస్తున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. పాకిస్తాన్‌లో ఆమ్లెట్ ఇలాక్కూడాచేస్తారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌కి (Pakistan) చెందినగా ప్రచారం జరుగుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఆమ్లెట్ (Omelet) చేస్తుంటాడు. సాధారణంగా ఎవరైనా ఆమ్లెట్ చేయాంటే.. ఏం చేస్తారు.. గుడ్డును పగులగొట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తదితరాలను కలిపి కాస్త నూనె వేసి వేడి చేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. పెద్ద ఇనుప పెనం ఎదురుగా నిలబడ్డ ఆ వ్యక్తి గుడ్డును (egg) పగులగొట్టి అందులో వేశాడు.
ఇందులో షాకవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను గడ్డు పగులగొట్టి పెనంపై వేస్తున్నమాట వాస్తవమే గానీ.. పెనంపై ఉన్న ఆయిల్ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆయిల్ పూర్తిగా నల్లగా ఉండడంతో ఇంజిన్ ఆయిల్ అని చెబుతున్నారు. చూసేందుకూ అలాగే ఉన్న ఆ ఆయిల్‌లో గుడ్డు సొనను వేసి మిక్స్ చేశాడు. దీంతో ఆమ్లెట్ కూడా చివరకు నల్లగా మారిపోయింది. ఆ తర్వాత దాన్ని నలిపేసి.. పక్కనే సిద్ధంగా ఉంచుకున్న మిశ్రమంలో మిక్స్ చేస్తాడు. చివరగా ఆ మిశ్రమాన్ని మళ్లీ తీసుకుని ఆయిల్‌లో వేడి చేసేశాడు. ఇలా విచిత్రమైన పద్ధతిలో ఆమ్లెట్ వేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడన్నమాట.
ఇది ఎక్కడ జరిగిందో ఖచ్చితమైన ఆధారాలు లేకున్నా.. అంతా పాకిస్తాన్‌లోనే అని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వీడియో అసంపూర్తిగా ఉంది.. ఆ తర్వాత అతను దానిపై ఉమ్మి కూడా వేస్తాడు’.. అంటూ కొందరు, ‘ఈ ఆమ్లెట్ తింటే పై ప్రాణాలు పైన్నే పోతాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5,100కి పైగా లైక్‌లు, 5.64 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..