Train Viral Video: వార్నీ.. ఇదెక్కడి తెలివిరా అయ్యా.. రైల్లో ఫోన్ చార్జింగ్ ఎలా చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Jun 21 , 2025 | 07:24 PM
రైల్లో ఓ వ్యక్తి లగేజీ ర్యాక్‌పై పడుకున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పడుకున్న అతను ఫోన్ చార్జింగ్ పెట్టిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు..

రైల్లో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైల్లో ఫోన్ చార్జింగ్ పెట్టిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇలాంటి ప్రయోగాలు బీహార్‌లోనే సాధ్యమేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్లో (Train) ఓ వ్యక్తి లగేజీ ర్యాక్‌పై పడుకున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పడుకున్న అతను ఫోన్ చార్జింగ్ (Phone charging) పెట్టిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
సాధారణంగా ఎవరైనా రైల్లో చార్జింగ్ పెట్టాలంటే.. సీట్ల మధ్యలో ఉన్న బోర్డులో పెట్టుకోవడం కామన్. అయితే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా తన పక్కనే బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. ఇళ్లల్లో ఏర్పాటు చేసే స్విచ్‌లతో కూడిన బోర్డును (Switch board) తన పక్కనే సెట్ చేసి పెట్టుకున్నాడు. ఎంచక్కా చార్జర్‌ను అందులో పెట్టి ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకున్నాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్..! ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఫోన్‌కు చార్జింగ్ ఇలాక్కూడా పెట్టొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 56 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..