Bull Funny Video: ఎద్దును వెంబడించి మరీ వీడియో తీశాడు.. చివరకు ఇలా షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు..
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:25 PM
ఓ ఎద్దును తాళ్లతో కట్టి మరీ వాహనం నుంచి కిందకు దించారు. ఎంతో జాగ్రత్తగా కిందకు దించగా.. చివరకు అది వారందరికీ షాక్ ఇస్తుంది. కిందకు దిగిన వెంటనే ఒక్కసారిగా పరుగందుకుంటుంది. ఆ సమయంలో ఎద్దును వీడియో తీస్తున్న వ్యక్తి.. దాంతో పాటూ వీధుల వెంట పరుగులు తీస్తూ వీడియో తీసుకుంటూ వెళ్లాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్ ఉండడంతో కంటికి కనిపించే ప్రతి దృశ్యాన్నీ కెమెరాల్లో బంధిస్తున్నారు. కొందరైతే సినిమా లెవల్లో చిత్రీకరణ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి తమ క్రియేటివిటీని మొత్తం బయటికి తీస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంటుంది. ఇలాంటి సంఘనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పరుగెడుతున్న ఎద్దును వీడియో తీయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎద్దును తాళ్లతో కట్టి మరీ వాహనం నుంచి కిందకు దించారు. ఎంతో జాగ్రత్తగా కిందకు దించగా.. చివరకు అది వారందరికీ షాక్ ఇస్తుంది. కిందకు దిగిన వెంటనే ఒక్కసారిగా పరుగందుకుంటుంది. తాళ్లతో సహా వీధుల వెంట (Bull Running Through The Streets) పరుగులు తీస్తుంది. ఎద్దును ఆపాలని చూసిన వ్యక్తిని కొమ్ములతో పక్కకు తోసేసి మరీ ముందుకు ఉరుకుతుంది.
ఆ సమయంలో ఎద్దును వీడియో తీస్తున్న వ్యక్తి.. దాంతో పాటూ వీధుల వెంట పరుగులు తీస్తూ వీడియో తీసుకుంటూ వెళ్లాడు. ఎద్దు ఎంత వేగంగా పరుగులు పెట్టినా.. అతను కూడా అంతే వేగంగా పరుగెడుతూ, మరోవైపు చాకచక్యంగా వీడియో తీస్తుంటాడు. ఇలా చాలా దూరం పరుగెత్తిన ఎద్దు ఓ సందు వద్ద సడన్‌గా ఆగుతుంది. ఆ వెంటనే ఒక్కసారిగా వెనక్కు తిరిగి కెమెరామెన్‌ను చూస్తుంది. అతన్ని చూడగానే దాని కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంకేముందీ.. వెంటనే వెనక్కు వచ్చి (Bull Tries To Attack Cameraman) అతడిపై దాడి చేయాలని చూస్తుంది.
ఎద్దు నుంచి తప్పించుకునే క్రమంలో ఆ కెమెరామెన్ చివరకు ధబేల్‌మని కిందపడిపోతాడు. ఇంతటితో ఆ వీడియో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘కెమెరామెన్‌కు షాకిచ్చిన ఎద్దు’.. అంటూ కొందరు, ‘అయ్యో.. పడిన కష్టం మొత్తం వృథా అయిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..