Share News

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:37 PM

ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Stunt Viral Video: స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఎలా దిగేశాడో చూస్తే..

రైళ్లలో చాలా మంది వివిధ రకాల విన్యాసా చేస్తుంటారు. కొందరు డోరుకు ప్రమాదకరంగా వేలాడుతూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణాలు పోయే సంఘనటలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో అంతా ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్కక్తి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఇతనెవరో గానీ స్పైడర్ మ్యాన్‌లా ఉన్నాడే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రన్నింగ్ రైల్లో డోరు వద్ద నిలబడి వేలాడుతుంటాడు. రైలు నుంచి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అతన్ని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు.


డోరుకు రెండు వైపులా ఉన్న ఇనుప రాడ్లను పట్టుకున్న ఆ యువకుడు కాసేపు ముందుకు, వెనక్కు ఊగుతాడు. ఆ తర్వాత సడన్‌గా (man jumps from running train) కిందకు దూకేస్తాడు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి దిగినా కూడా అతను కిందపడిపోకుండా.. ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేసుకుని నడుస్తూ వెళ్లిపోతాడు. ఇతడి డేంటరస్ స్టంట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.


అయితే దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠింగా శిక్షించాలని డిమాండ్ చేస్తు్న్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘ఇలాంటి పనులు చేయడం ఎంతో ప్రమాదం’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..

అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 22 , 2025 | 05:39 PM