Crocodile Attack Video: ఊహించని చావు అంటే ఇదేనేమో.. పక్షిని పట్టుకున్న పాము.. చివరకు ఆ రెండింటినీ..
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:35 PM
నీటి ఒడ్డున ఉన్న పక్షిని ఓ పాము టార్గెట్ చేస్తుంది. చివరకు పక్షిపై పాము సడన్‌గా దాడి చేస్తుంది. పాము సడన్‌గా చుట్టేయడంతో పక్షి విలవిల్లాడిపోతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయినా..

పురుగును కప్ప.. కప్పను పాము, పామును గ్రద్ద వేటాడటం కామన్. అయితే కొన్నిసార్లు విచిత్రంగా జరుగుతుంటుంది. అలాగే ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వేటను చంపాలని చూసేలోగా.. వాటినే చావు చుట్టేముట్టేస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పక్షిని పాము గట్టిగా పట్టేసుకుంటుంది. దాని ప్రాణాలు తీసేలోపు అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటి ఒడ్డున ఉన్న పక్షిని ఓ పాము టార్గెట్ చేస్తుంది. చివరకు పక్షిపై పాము సడన్‌గా దాడి చేస్తుంది. పాము సడన్‌గా చుట్టేయడంతో (Snake attack on bird) పక్షి విలవిల్లాడిపోతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయినా పక్షి వల్ల సాధ్యం కాదు.
కాసేపట్లో పక్షి ప్రాణం పోతుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. నీళ్లలో నుంచి దూసుకొచ్చిన ఓ పెద్ద మొసలి.. పాము, పక్షిని (Crocodile attack on bird and snake) ఒకేసారి నోట కరుచుకుంటుంది. రెండింటినీ పట్టుకుని నీటిలోకి లాగేసుకుంటుంది. ఈ ఘటనలో మొసలి దాడిలో పాము, పక్షి రెండూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా పక్షిని వేటాడాలని చూసిన పాము.. చివరకు అనూహ్యంగా మొసలికి ఆహారం అవ్వాల్సి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పక్షిని పాము చంపితే.. పామును మొసలి చంపింది’.. అంటూ కొందరు, ‘కాంబో మీల్స్ అంటే ఇదేనేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 వేలకు పైగా లైక్‌లు, 4.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..