Stunt Viral Video: లారీ వెనుక లారీ.. మధ్యలో డ్రైవర్ షాకింగ్ స్టంట్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:37 PM
ఓ వ్యక్తి లారీ నడుపుతుండగా.. అతడికి ఎదురుగా కొద్ది గ్యాప్‌లో మరో లారీ వెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి వివేషం లేకున్నా.. ఈ సమయంలో ఆ డ్రైవర్ చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. లారీ రన్నింగ్‌లో ఉండగానే..

వాహనాలతో విన్యాసాలు చేసే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరైతే కదులుతున్న వాహనాలపై డేంజరస్ స్టంట్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. బైకులు, కార్లు, బస్సుల్లో ఇలాంటి విన్యాసాలు చేయడం చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కదులుతున్న లారీలో డ్రైవర్ చేసిన విన్యాసాల వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అసలు ట్విస్ట్‌ను రివీల్ చేశారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి లారీ నడుపుతుండగా.. అతడికి ఎదురుగా కొద్ది గ్యాప్‌లో మరో లారీ వెళ్తుంటుంది. ఇందులో ఎలాంటి వివేషం లేకున్నా.. ఈ సమయంలో ఆ డ్రైవర్ చేసిన నిర్వాకం (Driver stunt in lorry) చూసి అంతా షాక్ అవుతున్నారు. లారీ రన్నింగ్‌లో ఉండగానే.. డోరు తీసుకుని కిందకు దిగి.. లారీ ముందు వైపునకు వెళ్లి, అటు నుంచి అటే అవతలి వైపుకు తిరిగి ఇంకో డోరు నుంచి లోపలికి వచ్చాడు.
లోపలికి వచ్చిన డ్రైవర్ మళ్లీ యథావిధిగా డ్రైవింగ్ సీటులోకి వచ్చి వాహనాన్ని కంట్రోల్ చేస్తాడు. అతడు స్టంట్ చేస్తున్న సమయంలో ఆ వాహనానికి ముందు కొద్ది గ్యాప్‌లో మరో లారీ వెళ్తుంటుంది. ఏమాత్రం అటూ, ఇటూ అయినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ వీడియోను బాగా గమనించిన వారు అసలు ట్విస్ట్‌ను బయటికి తీస్తున్నారు. అతను నిజంగా డ్రైవింగ్ చేయలేదని, ఆ రెండు లారీలు ట్రైన్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వీడియో చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తోంది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆహా.. ఇతడి యాక్టింగ్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఈ రెండు లారీలు ట్రైన్‌లో ఉన్నాయి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 1,2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..