Chimpanzee Viral Video: గుండెలకు హత్తుకునే సీన్.. చాలా రోజుల తర్వాత కేర్ టేకర్‌ను చూడడంతో..
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:38 PM
ఓ వ్యక్తి గతంలో చింపాంజీలకు కేర్ టేకర్‌గా పని చేసేవాడు. చాలా రోజుల తర్వాత తన చింపాంజీలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లను దాటుకుంటూ అవతల ఒడ్డున ఉన్న అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అడవిలో..

మనుషుల్లో మానవత్వం కరువవుతున్న రోజులివి. చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకోకపోగా.. తిరిగి వారికే ద్రోహం చేసే మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే నయమని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ చింపాంజీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చాలా రోజుల తర్వాత తన పూర్వ సంరక్షకుడిని చూసి భావోద్వేగానికి గురైంది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గతంలో చింపాంజీలకు (Chimpanzee) కేర్ టేకర్‌గా పని చేసేవాడు. చాలా రోజుల తర్వాత తన చింపాంజీలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లను దాటుకుంటూ అవతల ఒడ్డున ఉన్న అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అడవిలో నుంచి తన కేర్ టేకర్‌ను చూసిన చింపాంజీ.. ఆనందంతో నీటిలోకి దిగి పరుగు పరుగున అతడికి ఎదురుగా వచ్చింది.
అతను చింపాంజీల కోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాడు. అయితే తన కేర్ టేకర్‌ను చూసిన ఆనందంలో చింపాంజీ.. పండ్లను తీసుకోవడం కంటే ముందుగా (Chimpanzee hugging caretaker) అతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. గతంలో ఆ వ్యక్తి చూపిన ప్రేమను.. ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న చింపాంజీ.. ఈ విధంగా తన ప్రేమను వ్యక్తపరిచింది.. ఆ తర్వాత అతను తెచ్చిన పండ్లు తీసుకుని అక్కడి నుంచి గట్టుపైకి వెళ్లిపోతుంది. అయితే అప్పటికే అక్కడే మరిన్ని చింపాంజీలు కూర్చుని అతడు విసిరేసిన పండ్లను తింటుంటాయి.
ఇలా చింపాంజీ తన మాజీ కేర్ టేకర్‌ను చూడగానే భావోద్వేగానికి గురైందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ మనుషుల కంటే చింపాంజీలే నయం’.. అంటూ కొందరు, ‘ ఈ చింపాజీలో మానవత్వం కనిపిస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8400కి పైగా లైక్‌లు, 2.91 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..