Viral Jobs: లవ్ ఫెయిల్యూరా.. అయితే మీరు అదృష్టవంతులే.. ఈ కంపెనీలో బంపరాఫర్..
ABN , Publish Date - Jan 31 , 2025 | 10:35 AM
సోషల్ మీడియాలో ఓ కంపెనీ వింత జాబ్ ఆఫర్ వార్త తెగ వైరల్ అవుతోంది. సదరు కంపెనీలో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఇందుకోసం విద్యార్హతలకు బదులుగా ఓ వింత కండీషన్ పెట్టారు.. ఈ ఆఫర్ విని అంతా అవాక్కవుతున్నారు..

లవ్‌లో ఫెయిల్ అయిన వారు గడ్డాలు పెంచుకని, తాగుడుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను ముగిస్తుంటారు. అయితే ఇలాంటి వారికి ఓ కంపెనీ బంపరాఫర్ ఇస్తోంది. అందులోనూ వారి ఇచ్చే ఉద్యోగానికి లవ్ బ్రేకప్ అయిన వారు మాత్రమే అర్హులట. దీంతో పాటూ మరికొన్ని వింత కండీషన్లతో సదరు కంపెనీ దేవదాసులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ కంపెనీ ఇచ్చిన ఆఫర్ చూసి యువత ఆశ్చర్యానికి గురవుతోంది. ‘‘వావ్.. భలే మంచి ఆఫర్’’.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ కంపెనీ వింత జాబ్ ఆఫర్ వార్త (Job Offer News) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు (Bangalore) చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ.. తమ కంపెనీలో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఇందుకోసం విద్యార్హతలకు బదులుగా ఓ వింత కండీషన్ పెట్టారు. లవ్ బ్రేకప్ (Love Breakup) అయిన వారు మాత్రమే ఆ ఉద్యోగానికి అర్హులని ప్రకటించింది.
Viral Video: విమానంలో ఎయిర్‌హోస్టెస్.. అక్కడే కూర్చున్న వ్యక్తి ఫోన్‌తో చేస్తున్న నిర్వాకం చూడగా..
ఈ జాబ్ చేయాలంటే తప్పనిసరిగా 3 డేట్స్, రెండు సిట్యయేషన్‌షిప్‌లు, కనీసం ఒకసారైనా బ్రేకప్ చెప్పి ఉండాలని నిబంధన విధించింది. ఇలాంటి అర్హతలున్న వారు మాత్రమే తమ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు అర్హులని ప్రకటించింది. అలాగే దీంతో పాటూ కొత్త డేటింగ్ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలని, 2 లేదా 3 డేటింగ్ యాప్‌లను ప్రయత్నించి ఉండాలని చెప్పింది. దీన్ని ధృవపరిచేందుకు ఎలాంటి సాక్షాలూ అవసరం లేదని, అభ్యర్థుల నిజాయితీనే తాము పరిగణలోకి తీసుకుంటామని కూడా తెలిపింది.
Monkey Viral Video: భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న కోతి.. చివరకు జరిగిందేంటో చూడండి..
తాము సూచించిన అర్హతలు ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అయితే జీతానికి సంబంధిన వివరాలను మాత్రం సదరు కంపెనీ వెళ్లడించలేదు. సాధారణంగా ఉద్యోగార్హత ఆధారంగా జాబ్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మాత్రం విచిత్రంగా లవ్ బ్రేకప్ అయిన వారికే ఉద్యోగం అని చెప్పడంతో అంతా అవాక్కవుతున్నారు. ‘‘ఇలాంటి బంపరాఫర్ ఎక్కడా చూడలేదు.. ఈ జాబ్‌కు మేమంతా అర్హులమే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ప్రాణాలంటే లెక్కే లేదా.. ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..