Share News

Viral Video: విమానంలో ఎయిర్‌హోస్టెస్.. అక్కడే కూర్చున్న వ్యక్తి ఫోన్‌తో చేస్తున్న నిర్వాకం చూడగా..

ABN , Publish Date - Jan 31 , 2025 | 07:31 AM

ఓ విమానంలో ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌హోస్టెస్ ప్రయాణికులందరికీ భోజనాలు సరఫరా చేస్తోంది. ముందు నుంచి వెనక్కు జరుగుతూ అందరికీ ఫుడ్ అందిస్తోంది. ఈ సమయంలో ఆమె వెనుకే కూర్చున్న వ్యక్తి..

Viral Video: విమానంలో ఎయిర్‌హోస్టెస్.. అక్కడే కూర్చున్న వ్యక్తి ఫోన్‌తో చేస్తున్న నిర్వాకం చూడగా..

మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంటా, బయటా రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఇక బస్సులు, రైలు ప్రయాణాల్లో కొందరు ఆకతాయిలు.. మహిళలను తాకరాని తోట తాకుతూ పైశాసికానందం పొందతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విమానంలో ఓ ఎయిర్‌హోస్టెస్ ఫుడ్ సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ప్రయాణికుడు చేసిన నిర్వాకం చూసి అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ విమానంలో (plane) ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌హోస్టెస్ ప్రయాణికులందరికీ భోజనాలు సరఫరా చేస్తోంది. ముందు నుంచి వెనక్కు జరుగుతూ అందరికీ ఫుడ్ అందిస్తోంది. ఈ సమయంలో ఆమె వెనుకే కూర్చున్న వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Train Viral Video: బతుకు, చావుకు మధ్య రెండే సెకన్లు.. ఈ యువతికేమైందో మీరే చూడండి..


తన ఫోన్ బయటికి తీసి, ఎయిర్‌హోస్టెస్ కాళ్ల కింద పెట్టి (Passanger Records Airhostess Video) వీడియో తీస్తున్నాడు. తననూ ఎవరూ గమనించలేదు.. అనుకుని ఆమెను అలా వీడియో తీస్తున్నాడు. అయితే ఇదంతా వెనక నుంచి గమనిస్తున్న సెక్యూరిటీ చివరకు అతడి వద్దకు వెళ్లి ఫోన్ లాక్కున్నారు. ఆ వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి అసభ్యకర ప్రవర్తన చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Train Viral Video: సీటు కోసం ఫీట్లు.. ఏకంగా స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడుగా..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి నీచమైన పనులు చేయడం చాలా దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 1.31 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మాట వినకపోతే మటాషే.. భర్తను ఎలా వణికించిందో చూస్తే.. అదిరిపడతారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 31 , 2025 | 07:31 AM