Share News

Cyclone Montha: రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:14 PM

మొంథా తుఫాను దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మొంథా తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

Cyclone Montha: రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్
Minister Satyakumar On Cyclone Montha

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను (Cyclone Montha) దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) పేర్కొన్నారు. మొంథా తుఫానుతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పై నుంచి కింది స్థాయి అధికారుల వరకు సీఎం చంద్రబాబు నిరంతరం ముందస్తుగా అప్రమత్తం చేశారని వివరించారు. సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌లో కూర్చుని తుఫాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ.. అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.


తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారని ఉద్ఘాటించారు. సీఎం చర్యలతో ప్రజలు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహకారం అందించారని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకోవడం ద్వారా తుఫాను విపత్తు నుంచి ఏపీని కాపాడారని నొక్కిచెప్పారు మంత్రి సత్యకుమార్ యాదవ్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2555 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించి ప్రసవం కోసం వైద్యం అందించామని చెప్పుకొచ్చారు. తుఫాను ప్రాంతాల్లో మందుల కొరత లేకుండా వైద్యా, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ చేస్తూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 671 అంబులెన్సులు, 885.. 104 సంచార వాహనాలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రజలు వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రజలు కాచి వడబోసిన నీటినే తాగాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

అన్ని రేషన్ షాపులకు నిత్యావసర సరుకులు.. పవన్ ట్వీట్

బాహుదా నదికి పోటెత్తిన వరద.. ఇచ్ఛాపురం జలదిగ్భంధం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 04:22 PM