Home » Heavy Rains
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.