Heavy Rains: దక్షిణాదిని ముంచెత్తిన వాన
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:32 PM
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాదిన ఉన్న జిల్లాలను వర్షం ముంచెత్తింది. అలాగే.. తంజావూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి, అరటి తోటలు నీట మునిగాయి. వివరాలిలా ఉన్నాయి.
- తంజావూరు జిల్లాలో 22 ఇళ్లు ధ్వంసం
- తూత్తుకుడిలో జలదిగ్బంధంలో నివాసాలు
చెన్నై: దక్షిణాది జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తేస్తున్నాయి. తంజావూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి, అరటి తోటలు నీట మునిగాయి. జిల్లాలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయం వరకూ కొనసాగాయి. మళ్ళీ సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం వేకువజాము వరకు చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో 4 వేల ఎకరాల విస్తీర్ణంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నీట మునిగింది. వర్షానికి జిల్లాలో 13 పూరిగుడిసెలు సహా మొత్తం 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. నాలుగు పశువులు మరణించాయి.

మేట్టూరు డ్యాంకు పెరిగిన ఇన్‌ఫ్లో...
సేలం జిల్లా మేట్టూరు డ్యామ్‌లో నీటిమట్టం 113.81 అడుగులకు పెరిగింది. సోమవారం ఉదయం ఆ డ్యాంలోకి సెకనుకు 5223 ఘనపుటడుగుల చొప్పున జలాలు ప్రవేశించాయి. మంగళవారం ఉదయం సెకనుకు 6414 ఘనపుటడుగుల చొప్పున ఆ డ్యామ్‌లోకి జలాలు ప్రవేశిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. డ్యామ్ నుంచి కావేరి డెల్టాకు 1000 ఘనపుటడుగుల చొప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్‌లో ప్రస్తుతం 83.94 టీఎంసీల నీరుందని అధికారులు వెల్లడించారు.

కుట్రాలంలో...
తెన్‌కాశి జిల్లా తెన్‌కాశి, కుట్రాలం, సెంగోట తదితర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురవటంతో అక్కడి జలపాతాలు నీటితో హోరెత్తుతున్నాయి.. కుట్రాలం ప్రధాన జలపాతం, ఐందరువి, పాత కుట్రాలం, పులియరువి, సిట్రరువి తదితర జలపాతాల వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండటంతో మంగళవారం పర్యాటకులను స్నానం చేయకుండా అధికారులు నిషేధం విధించారు.
తూత్తుకుడి జిల్లాలో జలదిగ్బంధంలో ఇళ్లు
తూత్తుకుడి జిల్లా కాయల్‌పట్టినంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఆ నగరంలోని ప్రధాన వీధులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 500లకు పైగా ఇళ్ల చుట్టూ మోకాలి లోతున వర్షపు నీరు ప్రవ హించింది. మాట్టుకుళం, రత్నపురి, సీతకాత్తినగర్, బైపా్‌సరోడ్డు తదితర ప్రాంతాల్లోని ఇళ్లన్నీ జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో పురపాలక సంఘం అధికారులు ఇళ్ళ చుట్టూ చేరిన వాననీటిని మోటార్లతో తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

హొగనేకల్‌లో...
కర్ణాటకలోని ప్రధాన జలాశయాల నుండి విడుదల చేస్తున్న జలాలు, కావేరి నదిలో ప్రవహిస్తున్న నీటితో కలిసి హొగనేకల్ జలపాతంలో ఇన్‌ఫ్లో విపరీతంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రధా న జలపాతం, సినీఫాల్స్, ఐందరువి తదితర జలపాతాలన్నీ జల కళ సంతరించుకున్నాయి. పర్యాటకులు దోనెలలో సవారీ చేసేందుకు బారులు తీరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News