Heavy Rains in AP: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:40 AM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అమరావతి, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ఇవాళ(గురువారం) ఓ ప్రకటన విడుదల చేశారు. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని తెలిపారు.
ఇవాళ(గురువారం) తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. ఆ తదుపరి 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. వర్షాలతో చెట్ల వద్ద ఉండరాదని, కరెంట్ స్తంభాలను పట్టుకోరాదని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..
For More AP News And Telugu News