Pawan Kalyan:ఈసారి కొట్టే దెబ్బ గుర్తుండిపోవాలి..! పవన్ ఉగ్రరూపం

ABN, Publish Date - Apr 29 , 2025 | 12:45 PM

ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి: ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దాక మాట్లాడిన విధానంలో చాలా సాఫ్ట్‌గా మాట్లాడనని చెప్పారు. ఉగ్రవాదులు హిందూవులను టార్గెట్ చేసి చంపారని అన్నారు. తాము చేసిన పాపం హిందువులుగా పుట్టడమా అని ఉగ్రదాడిలో చనిపోయిన మధుసూదన్ భార్య తనను అడిగారని పవన్ కల్యాణ్ చెప్పారు. కనీసం తమ చేతిలో ఆయుధాలు కూడా లేవని... కనీసం తాము సైనికులం కూడా కాదని ఆమె తనతో అన్నారని గుర్తుచేశారు. మధుసూదన్ కుటుంబం మొత్తం పహల్గామ్ వెళ్లారని అన్నారు. పాకిస్థాన్‌ను మూడుసార్లు యుద్ధంలో మనం ఓడించామని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.


భారతదేశానికి సహనం ఎక్కువ అయిపోయిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఏదైనా అతి చేస్తే మంచిది కాదని తెలిపారు. అతి సహనం కూడా మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్లిపోతామంటే మనం ఎందుకు ఊరుకోవాలని అన్నారు. ఎంతమంది పాకిస్థానీయులు భారతదేశానికి వచ్చి ఉంటున్నారో మనకు తెలీదన్నారు. వాళ్లు ఏ ముసుగులో ఉంటున్నారో కూడా తెలీదని చెప్పారు. మనకు పదవులు వచ్చాయా, గెలచామా అన్నది ప్రాధాన్యం కాదన్నారు. మనం ఎంత బాధ్యతగా ఉండగలం అన్నదే కావాలని తెలిపారు. ఆలయాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారా అనే విషయం మనం మొదటగా గుర్తించాలని చెప్పుకొచ్చారు. మూడు సార్లు యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత కూడా మనం మౌనంగా ఉండటాన్ని చూసి వారు రెచ్చిపోతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్‌!

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 29 , 2025 | 12:53 PM