Home » Deputy CM Pawan Kalyan
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ సమావేశమై.. వారిని సత్కరించారు.
ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్‌లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలు ఎందుకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని సూచించారు.
అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని.. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
భవిష్యత్తు రాజధాని అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.
డిప్యూటీ సీఎం పవన్ రాజమండ్రి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం నెలకొంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో పోలీసులతో రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.