Pawan Kalyan: రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్ భరోసా
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:29 PM
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తమ ప్రభుత్వంలో సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ(బుధవారం) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను విని.. పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కల్యాణ్.
కోనసీమ రైతులకు గళామవుతా..గొంతువవుతానని ధైర్యం చెప్పారు. అన్నదాతల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే తాను ఇక్కడకు వచ్చానని.. ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. శంకరగుప్తం డ్రైన్‌తో తాగునీటి జలాలు ఉప్పుమయంగా మారాయని వివరించారు. జిల్లాలో డ్రైన్ ఆధునికీకరణకు రూ.4వేల కోట్లు అవసరమని తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మాటిచ్చారు. రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. డిసెంబరు రెండో వారంలో రైతన్నలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అధికారులకు పవన్ కల్యాణ్ వార్నింగ్..
కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై అధికారులను సున్నితంగా పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శంకరగుప్తం డ్రైన్ సమస్యపై తన పేషీ అధికారులు ఇచ్చిన నివేదికను చదివి వినిపించారు పవన్ కల్యాణ్. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. శంకర్ గుప్తం డ్రైయిన్‌కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని నిలదీశారు. డిసెంబరు రెండో వారంలో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీం చంద్రబాబు
Read Latest AP News And Telugu News